NTV Telugu Site icon

Wound Healing: ఔషధ మొక్కను ఉపయోగించుకొని స్వీయ చికిత్స చేసుకున్న కోతి..

Male Monkey

Male Monkey

మనుషులు మాత్రమే కాదు, అడవిలో నివసించే జంతువులు కూడా మూలికలు, మొక్కల ద్వారా వాటికవే వైద్యం చేసుకొని నయం చేసుకుంటాయి. ఈ కేసును మొదట ఇండోనేషియా పరిశోధకులు నమోదు చేశారు. ఈ విధంగా వైద్యం చేసుకుంటున్న సుమత్రన్‌ ఒరాంగుటాన్స్‌ అనే జాతికి చెందిని ఒక మగ కోతిలో విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఇండోనేషియా, జర్మనీ లోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బిహేవియరల్ బయాలజీ పరిశోధకులు చాలా రోజులుగా తోకలేని కోతిపై అధ్యయనం చేస్తున్నారు. ఇంకా అవిటికి సంబంధించిన విషయాలని బయటకి తెలపలేదు.

Also Read: Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. ఇక కష్టమే!

మరో కోతితో కొట్లాటలో ఓ మగ కోతి ముఖానికి గాయమైంది. అందుకుగాను ఫైబులియా టింక్చర్ అనే మొక్క ఆకులతో చికిత్స కోతి చికిత్స స్వయంగా చేసుకుంది. ముందుగా ఈ ఆకులను నమిలి ఆ రసాన్ని గాయంపై పూసుకొని., ఆ తర్వాత నమిలిన ఆకులను గాయానికి పట్టించుకుంది. వీటితోపాటు కోతులు తమ గాయాలను నయం చేసుకోవడానికి సాధారణం కంటే ఎక్కువగా నిద్రపోతున్నాయని పరిశోధకులు తెలిపారు. అయితే, ఈ మొక్క నిజమైన ఔషధ గుణాలను కలిగి ఉందని., ఈ మొక్క మలేరియా, స్కార్లెట్ ఫీవర్, డయాబెటిస్ చికిత్సకు ఉపయోగిస్తారని వైద్యులు తెలిపారు.