World’s Shortest Bodybuilder: తనను చూసి నవ్వే ప్రతి ఒక్కరికి సవాల్ విసిరి మరి వారితోనే శభాష్ అనిపించుకున్నాడు ఈ కుర్రాడు.అతను మరెవరో కాదు ప్రతీక్ విఠల్ మోహితే. అయితే అతని శరీరమే అతనికి శాపంగా మారింది.ఎందుకంటే ప్రతీక్ అందరిలాగా కాకుండా పొట్టిగా ఉంటాడు.అంటే ప్రతీక్ కేవలం 3.4 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాడు. మహారాష్ట్ర చెందిన ప్రతీక్ గిన్నిస్ రికార్డుకెక్కి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి అందరికి తెలిసిందే. 2022 ఎడిషన్ కు సంబంధించిన పోటీల్లో ప్రతీక్ విట్టల్ ప్రపంచలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్ గా రికార్డు సంపాదించాడు. ఇప్పుడు అతడు ఓ అమ్మాయిని పెళ్లిచేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. 3 అడుగుల 4 అంగుళాలతో ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్ అయిన ప్రతీక్ విఠల్ మోహితే 4 అడుగుల 2 అంగుళాల పొడవు గల జయను వివాహం చేసుకున్నాడు. అతను 2021లో ప్రపంచంలో అత్యంత పొట్టి పోటీ బాడీబిల్డర్ (పురుషుడు)గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల బాడీబిల్డర్ తనలాగే పొట్టిగా ఉన్న 22 ఏళ్ల జయను వివాహం చేసుకున్నాడు. ప్రతీక్ తన భాగస్వామిని నాలుగేళ్ల క్రితం కలిశాడని, తర్వాత ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని డైలీ మెయిల్ పేర్కొంది. తన వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. బాడీబిల్డర్ తన హల్దీ వేడుక నుంచి కొన్ని వీడియోలను కూడా పంచుకున్నాడు.
Read Also: Bus Accident: పుల్వామాలో బస్సు బోల్తా.. నలుగురు మృతి, 28 మందికి గాయాలు
ప్రతీక్ విఠల్ మోహితే 2012లో తన బాడీబిల్డింగ్ వృత్తిని ప్రారంభించాడు. మొదట్లో అతని పరిమాణం కారణంగా వ్యాయామాలు చేయడం, పరికరాలను పట్టుకోవడంలో చాలా కష్టపడ్డాడు. పట్టు వదలకుండా జిమ్‌లో కష్టపడ్డాడు. ప్రతీక్ మొదటిసారిగా 2016లో బాడీబిల్డింగ్ పోటీలో పాల్గొన్నాడు. అతని కుటుంబం, స్నేహితులు చాలా మద్దతు తెలపడంతో పాటు ఎంత సహాయం చేశారని అతను చెప్పాడు. అతను తన స్నేహితుడి సూచన మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2021లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి పోటీ బాడీబిల్డర్‌గా ఎంపికయ్యాడు.