NTV Telugu Site icon

World Highest Polling Station: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రం.. ఎక్కడో తెలుసా?

Polling Station

Polling Station

World Highest Polling Station: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్‌ కేంద్రంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని తాషిగ్యాంగ్‌ రికార్డు నెలకొల్పింది. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో తాషిగ్యాంగ్‌ ఉంది. ఈ ఊరిలో మొత్తం 52 మంది ఓటర్లు ఉన్నారు. . ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న పోలింగ్ బూత్‌గా రికార్డు సృష్టించారు. ఇవాళ హిమాచ‌ల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఆ పోలింగ్ కోసం మారుమూల ప్రాంతాల్లో మూడు తాత్కాలిక ఓటింగ్‌ కేంద్రాలు సహా రాష్ట్రవ్యాప్తంగా 7,884 పోలింగ్ స్టేష‌న్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

Election Commission: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఎగ్జిట్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై నిషేధం

ఇక కొండ ప్రాంతాల వాళ్ల కోసం కూడా ప్రత్యేకంగా పోలింగ్ బూత్‌ల‌ను ఏర్పాటు చేశారు. అత్యంత ఎత్తులో ఉన్న తాషిగ్యాంగ్ బూత్‌లో మొత్తం 52 మంది ఓట‌ర్లు ఓటు వేయ‌నున్నారు. సీనియ‌ర్ సిటిజ‌న్లు, దివ్యాంగ ఓట‌ర్ల కోసం ఆ బూత్‌ను మోడ‌ల్ పోలింగ్ స్టేష‌న్‌గా మార్చారు. హిమాచ‌ల్‌లో మొత్తం 68 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ సహా మొత్తం 412 మంది అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా 68 నియోజకవర్గాల్లో ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 8వ తేదీన ఫ‌లితాల‌ను వెల్లడించ‌నున్నారు.