NTV Telugu Site icon

Yograj Singh: ప్రపంచం మీపై ఉమ్మివేస్తుంది.. కపిల్ దేవ్‌ను టార్గెట్ చేసిన యువరాజ్ తండ్రి!

Yograj Singh

Yograj Singh

Yograj Singh Fires on Kapil Dev: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తరచుగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై విరుచుకుపడే యోగరాజ్.. ఈసారి మహీతో పాటుగా భారత జట్టుకు మొదటి వన్డే ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్‌ను కూడా టార్గెట్ చేశాడు. బాగా ఆడుతున్న సమయంలో తనను కపిల్ భారత జట్టు నుంచి తప్పించారని యోగరాజ్ అన్నాడు. అందుకు శిక్షగా ఆయనపై ప్రపంచం ఉమ్మివేస్తుందని ఆరోజే చెప్పానని సంచనల వ్యాఖ్యలు చేశాడు.

జీ స్విచ్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ… ‘యోగరాజ్ సింగ్ ఏమిటో చూపించాలనుకుంటున్నా. నన్ను చాలా తక్కువగా చూశారు. చెడ్డ పనులు చేసిన వారిని ఈ సమాజం నెత్తిన పెట్టుకుంది. అలాంటి ఓ వ్యక్తిని మీరు ఆల్ టైమ్ దిగ్గజ కెప్టెన్ అంటున్నారు. 1981లో నేను బాగా ఆడినా.. మిస్టర్ కపిల్ దేవ్ పక్కనపెట్టాడు. ఇందుకు శిక్షగా నీపై ప్రపంచం ఉమ్మివేస్తుందని ఆరోజే ఆయనకు చెప్పాను. ఈ రోజు యువరాజ్ సింగ్ వద్ద 13 ట్రోఫీలు ఉన్నాయి, నీవద్ద ప్రపంచకప్ ఒక్కటే ఉంది’ అని అన్నాడు.

Also Read: Paralympics 2024: పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే!

క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన యోగ్‌రాజ్‌ సింగ్‌పై క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీలు అందించిన వారిపై అలా ఎలా మాట్లాడుతావని మండిపడుతున్నారు. యోగ్‌రాజ్‌ భారత జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. యోగరాజ్ 1980-81 మధ్య భారతదేశం తరపున ఒక టెస్టు, ఆరు వన్డేలు ఆడాడు.