Site icon NTV Telugu

Kerala: ప్రపంచంలోనే అతి చిన్న మేక.. ఎత్తు 1 అడుగు 3 అంగుళాలు మాత్రమే.. గిన్నిస్ బుక్ లో నమోదు

Goat

Goat

మనుషుల్లో అతి పొట్టి, అతిపొడవు ఉన్నట్టుగానే సాధు జంతువుల్లో కూడా అతి పొట్టివి ఉన్నాయి. తాజాగా ప్రపంచంలోనే అతి చిన్న మేక వెలుగులోకి వచ్చింది. అంతేకాదు అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకుంది. కేరళకు చెందిన ఓ రైతు ప్రపంచంలోనే అతి చిన్న మేకను కలిగి ఉన్నాడు. ఈ చిన్న మేక యజమాని పీటర్ లెన్ను. తన మేకకు కరుంబి అని పేరు పెట్టాడు. అయితే అది అతి పొట్టిగా ఉండడంతో.. గిన్నిస్ రికార్డు పుస్తకంలో నమోదు చేసుకోవడానికి ప్రయత్నించాలని పలువురు సూచించినట్లు తెలిపాడు.

Also Read:KTR: చేయని శపథం లేదు.. ఆడని అబద్దం లేదు.. అక్షరాల 420 అబద్దపు హామీలు

అతను ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాడు. దానిని పశువైద్యుని వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కరుంబి ఎత్తు, ఆరోగ్యాన్ని తనిఖీ చేశారు. అది పూర్తిగా ఆరోగ్యంగా ఉందని, పూర్తిగా అభివృద్ధి చెందిందని, కానీ ఎత్తు తక్కువగా ఉందని నిర్ధారించారు. గిన్నిస్ బుక్ ప్రకారం ఈ మేక 2021లో జన్మించింది. పూర్తిగా పెరిగిన తర్వాత కూడా దాని ఎత్తు 1 అడుగు 3 అంగుళాలు మాత్రమే ఉంది. ఈ మేక కెనడియన్ పిగ్మీ జాతికి చెందినదని తెలిపారు.

Also Read:Sekhar Kammula : ప్రేక్షకులకు కొత్తగా ఏదైనా చూపించాలి అనేది నా ప్రయత్నం..

ఇది తక్కువ ఎత్తు, జన్యు మరుగుజ్జుకు ప్రసిద్ధి చెందింది. ఈ మేకల కాళ్ళు సాధారణంగా 21 అంగుళాల కంటే పొడవుగా పెరగవు. ప్రస్తుతం ఈ చిన్న మేక గర్భవతిగా ఉంది. ఈ నేపథ్యంలో దాని పిల్లలు కూడా పొట్టిగా ఉంటారని.. అవి కూడా కొత్త రికార్డు సృష్టించగలవని భావిస్తున్నారు. కరుంబి.. మరో మూడు మగ మేకలు, తొమ్మిది ఆడ మేకలు, పది చిన్న పిల్లలతో నివసిస్తుందని పీటర్ లెన్ను తెలిపారు.

Exit mobile version