World Record: ప్రస్తుతం ఇంటర్నెట్ రాజ్యమేలుతుంది అనడంలో ఎతువంటి అతిశయోక్తి లేదు. అప్పుడప్పుడు ఇంటర్నెట్‌లో రకరకాల ఛాలెంజ్‌లు వైరల్ అవుతుంటాయి. కొందరు ఫన్నీ ఛాలెంజ్‌లు చేస్తుంటే.. మరికొందరు తమ ఓపిక, పట్టుదలను పరీక్షించే అసాధారణమైన సాహసాలను చేస్తుంటారు. ఈ నేపథ్యంలో యూట్యూబర్ ‘నార్మే’ ఏకంగా 38 గంటలు కదలకుండా నిలబడి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
నార్మే చేసిన ఈ సాహసం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. 38 గంటల పాటు ఆయన ఒక్క అంగుళం కూడా కదలకుండా నిలబడి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఇది సాధారణమైన పని కాదు. అంతసేపు శరీరాన్ని స్థిరంగా ఉంచడం చాలా కష్టం. అయినప్పటికీ, తన అద్భుతమైన సెల్ఫ్ కంట్రోల్‌తో నార్మే ఈ రికార్డును సాధించాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో నార్మే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాడు. అతన్ని డిస్టర్బ్ చేయడానికి కొంతమంది ఫాలోవర్లు సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ మెసేజ్‌లు పంపించారు. ఇంకొందరు కావాలని ప్రాంక్స్ చేసి అతన్ని కదిలించడానికి ప్రయత్నించారు.
ఇంతకుముందే కాదు, కొంతమంది అతని స్థితిని గమనించి పోలీసులకు ఫోన్ చేసి అలర్ట్ చేశారు. అయినప్పటికీ, నార్మే అస్సలు డిస్టర్బ్ కాలేదు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఒక విగ్రహంలా నిలబడి రికార్డును సృష్టించాడు. నార్మే చేసిన ఈ సాహసం కేవలం ఒక రికార్డే కాదు.. ఓపిక, పట్టుదల, మానసిక స్థైర్యానికి నిదర్శనంగా నిలిచాడు. ప్రస్తుత ఉరుకు పరుగు ప్రపంచంలో ఏమీ చేయకపోవడమే ఒక్కోసారి పెద్ద ఛాలెంజ్. ఇది కేవలం శరీరానికే కాకుండా, మనసుకు కూడా పరీక్ష. అంతసేపు కదలకుండా నిలబడి ఉండటం కోసం బాడీని, మైండ్‌ను ప్రత్యేకంగా ట్రైన్ చేసుకోవాలి. డిస్ట్రాక్షన్స్‌ను పట్టించుకోకుండా ఉండేలా ఎంతో డిసిప్లిన్ అవసరం.
Read Also: Results: నేడు గ్రూప్-2 ఫలితాలు.. కాసేపట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటన
నార్మే చేసిన ఈ సాహసం వైరల్ అవడంతో ఆన్‌లైన్‌లో ఎంతోమంది అతని లైవ్ స్ట్రీమ్‌ను ఆసక్తిగా వీక్షించారు. కొందరు అతను అంతసేపు ఉంటాడో లేదో అని అనుకోగా.. నార్మే తన పట్టుదలతో చివరివరకు నిలబడి ప్రపంచ రికార్డులో చోటు సంపాదించాడు. నార్మే చరిత్ర సృష్టించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా అతనిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. నిజానికి చాలా మంది రికార్డులు క్రియేటివిటీ, సాహసోపేతమైన పనులకు సంబంధించినవే. కానీ, ఏమీ చేయకుండా నిలబడటం ద్వారా నార్మే రికార్డ్ సృష్టించాడంటే.. అది ఎంత క్లిష్టమైన పని అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘనతతో నార్మే పేరు రికార్డ్ బుక్స్‌లో స్థిరపడిపోయింది. చివరికి, నార్మే నిరూపించింది ఏమిటంటే.. చాలాసార్లు ఏమీ చేయకుండా ఉండటమే అసలు పెద్ద ఛాలెంజ్ అని.