Site icon NTV Telugu

Iran Crisis: అగ్రరాజ్యం దెబ్బకు ఇరాన్ గజగజ.. ఖమేనీ చూపు దుబాయ్ వైపు!

Iran Crisis

Iran Crisis

Iran Crisis: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తన కుటుంబంతో సహా దుబాయ్‌కు పారిపోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఇరాన్‌లో కొనసాగుతున్న అశాంతి మధ్య ఖమేనీ కుమారుడు దుబాయ్‌కు $1.5 బిలియన్లు (₹1,353 కోట్లు) బదిలీ చేశాడని ఈ ఛానల్ పేర్కొంది. అయితే ఈ డబ్బు బదిలీకి కారణం ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ విషయంపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా వ్యాఖ్యానించలేదు.

READ ALSO: Supreme Court: సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చుక్కెదురు..

1989లో ఖొమేనీ మరణం తరువాత, అలీ ఖొమేనీ ఇరాన్ సుప్రీం నాయకుడిగా నియమితులయ్యారు. ఆయతుల్లా అలీ ఖమేనీ కుటుంబంలో ఆయన భార్య మన్సౌరే ఖోజాస్తేతో సహా 10 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఖమేనీకి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖమేనీతో పాటు, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ కూడా ఇరాన్‌లో శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగాడు. ఇప్పటికే మోజ్తాబా.. ఇరాన్‌లో ఖమేనీ వారసుడి రేసులో బలమైన పోటీదారుగా ఉన్నారు.

దుబాయ్ పారిపోవడానికి ప్లాన్..
పలు నివేదికల ప్రకారం.. ఇరాన్ – ఇజ్రాయెల్.. రష్యా సహాయంతో ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం ఏ దేశం కూడా మరొక దేశంపై మొదటి దాడి చేయకూడదు. దీని అర్థం ఇరాన్ లేదా ఇజ్రాయెల్ మరొక దేశంపై మొదటి దాడి చేయవు. అటువంటి పరిస్థితిలో యుఎఇ, ముఖ్యంగా దుబాయ్, ఇరాన్‌కు సురక్షితమైన స్వర్గధామం అని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఇరాన్ – యుఎఇ మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఇటీవల రెండు దేశాలు యెమెన్ పై చర్చలు కూడా జరిపాయి. జూన్ 2025 లో ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని పరిష్కరించడంలో యుఎఇ ప్రధాన పాత్ర పోషించింది.

దుబాయ్‌కి ముందు ఖమేనీ కుటుంబం రష్యాకు పారిపోతుందనే చర్చ కూడా జరిగింది. ఇరాన్‌లో సంక్షోభం ఏర్పడితే ఖమేనీ తన మొత్తం కుటుంబంతో రష్యాకు పారిపోవచ్చని బ్రిటన్‌కు చెందిన ది టైమ్స్ నివేదించింది. రష్యా ఇరాన్ కు అత్యంత సన్నిహిత మిత్రదేశం. 86 ఏళ్ల ఖమేనీ ప్రస్తుతం తన కుటుంబంతో టెహ్రాన్ లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలు, మరొక వైపు అమెరికా, ఇజ్రాయెల్ భయం మధ్య ఖమేనీ ఏం చేస్తాడనే ఆసక్తిగా మారింది.

READ ALSO: Tollywood Sankranthi: టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డ్.. 5 సినిమాలు, 4 హిట్లు.. బాక్సాఫీస్ షేక్!

Exit mobile version