Site icon NTV Telugu

AP Chambers Business Expo: భారత్ వైపు ప్రపంచం చూస్తోంది: మంత్రి కొండపల్లి

Kondapalli Srinivas

Kondapalli Srinivas

AP Chambers Business Expo: ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పోలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. పాతికేళ్ల క్రితం చంద్రబాబు ఎలా ఆలోచించారో మనం చూశాం, ఐటీకి భవిష్యత్తు ఉంటుందని నాటి యువతను ప్రోత్సహించారు, అవసరమైన మౌళిక సదుపాయాలను ఆనాడు ఏర్పాటు చేశారని అన్నారు. భారత్ వైపు ప్రపంచం చూస్తోందని, దేశంలో పెట్టుబడులు ఎలా పెట్టాలని, దేశీయ మార్కెట్‌లో ఎలా అడుగు పెట్టాలనే దానిపై ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు.

READ ALSO: Lionel Messi: మెస్సీ ఈవెంట్ మేనేజర్‌ అరెస్ట్.. ఎవరీ సతద్రు దత్తా

తాను ఐటీ రంగంలో 16 ఏళ్లు రాణించడానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన విధానాలే అని వెల్లడించారు. ప్రతీ ప్రోడక్ట్ కూడా భారత సమాజంలో విక్రయించే అవకాశం ఉంటుందని, ప్రపంచంలో వాడే ప్రతీ వస్తువు భారత్‌లో వినియోగిస్తారని చెప్పారు. డ్రోన్ టెక్నాలజీ, ఏరో స్పేస్, బయో టెక్నాలజీ ఇలా అనేక రంగాల్లో క్లస్టర్‌లను ఏర్పాటు చేశారని అన్నారు. రాష్ట్రంలో సీఎం పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా పని చేస్తున్నారని వెల్లడించారు. పెద్ద పరిశ్రమలు వచ్చే దగ్గర, చిన్న తరహా పరిశ్రమలకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆయా అవకాశాలను చిన్న తరహా పారిశ్రామిక వేత్తలు వినియోగించుకోవాలని సూచించారు. రుణ, మార్కెట్, ప్రాజెక్ట్ తయారి సహా ఇతర సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని, మార్కెట్‌ను ఏ విధంగా పెంచుకోవాలనే దానిపై అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా మనం పని చేయాలని పిలుపునిచ్చారు. మన దేశంలో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తయారు అవుతాయని, వీటికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించే దిశగా అడుగులు వేయాలని అన్నారు. అలాగే స్థానిక ఉత్పత్తులను గుర్తించి వాటికి తగ్గట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు వెళ్లి, అక్కడ మీ సమస్యలు వివరిస్తే, మీ పారిశ్రామిక భవిష్యత్తుకు కావాల్సిన పరిష్కారాలు వాళ్లు అందిస్తారని అన్నారు. విద్యార్థులను పారిశ్రామిక రంగానికి అనుసంధానం చేసే వ్యవస్థ ప్రపంచంలో జర్మనీలో ఉంది. ఇటువంటి సిద్దాంతాన్ని మన రాష్ట్రంలో అమలు జరుగుతుందని చెప్పారు. దీనిని మంత్రి నారా లోకేష్ దగ్గర ఉండి మానిటర్ చేస్తూ, ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ను కూడా కేటాయించారని చెప్పారు.

READ ALSO: Tarun Bhaskar – Eesha: పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా?

Exit mobile version