Site icon NTV Telugu

World Kamma Mahasabhalu: ఈ నెల 20, 21 తేదీల్లో ప్రపంచ కమ్మ మహాసభలు

World Kamma Mahasabhalu

World Kamma Mahasabhalu

World Kamma Mahasabhalu: మన దేశంలో కులాలకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కులాలు అనేవి వృత్తిని బట్టి, పుట్టుకను బట్టి ఏర్పడ్డాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుల వ్యవస్థ భారత్‌లో ఉంది. కొన్ని కులాలు సమాజంలో ఉన్నత స్థితికి చేరాయి. అలాంటి కులాల్లో ఒకటి కమ్మ కులం. అన్ని రంగాల్లోనూ కమ్మ వారు రాణిస్తున్నారు. తెలుగు నేలపైనే కాకుండా విశ్వమంతా కమ్మవారు ఎన్నో విజయాలు సాధించారు. ప్రతీ రంగంలోనూ కమ్మవారు స్వయంకృషితో, క్రమశిక్షణతో అగ్రగాములుగా ముందుకు సాగుతున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన కమ్మ సామాజిక వర్గాన్ని ఒకే వేదికపైకి చేర్చి సేవా కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థే ‘కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌'(కేజీఎఫ్). కమ్మ గ్లోబల్ ఫెడరేషన్‌’. ఈ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో 20, 21 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రపంచ కమ్మ మహాసభలు జరగనున్నాయి.

Read Also: TG Govt: హైడ్రా విధివిధానాలు విడుదల చేసిన ప్రభుత్వం..

కాకతీయుల వారసత్వాన్ని అందుకున్న కమ్మవారు ఆత్మగౌరవంతో ఎలా బ్రతకాలో ప్రపంచానికి చాటుతున్నారు. ఈ నేపథ్యంలో కమ్మవారి ఐక్యతను చాటేందుకు, వారిని కూడగట్టేందుకు, ప్రగతి బాటన పయనించేందుకు “కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌” పేరిట ఈ సంస్థ ఇటీవల పురుడుపోసుకుంది. జెట్టి కుసుమ కుమార్ ఈ సంస్థ వ్యవస్థాపకులుగానూ, అధ్యక్షులుగానూ వ్యవహరిస్తున్నారు. అన్ని రంగాల్లో కమ్మవారు సాధించిన విజయాలను స్ఫురణ చేసుకుంటూ, భవిష్యత్తులో ఒక జాతిగా ఎలా ముందుకు సాగాలి, సమాజ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయాలి, ఇత్యాది అంశాలను చర్చించేందుకు జులై 20, 21 తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ అంటే హెచ్‌ఐసీసీలో “కేజీఎఫ్‌” పేరిట సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. వేలాది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. కమ్మజాతి తమ చరిత్రను, సంస్కృతిని గుర్తు చేసుకుంటూ, రేపటి తరానికి ఎటువంటి విలువలు అందించాలో ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.

Exit mobile version