Site icon NTV Telugu

Private Jet Villa: విలాసవంతమైన విల్లాగా విమానం.. వీడియో వైరల్!

Private Jet Villa

Private Jet Villa

Boeing 737 Plane Villa in Bali: పాడుబడ్డ బోయింగ్‌ 737 విమానాన్ని ప్రైవేట్‌ లగ్జరీ విల్లాగా మార్చిన విషయం తెలిసిందే. విమానంలో నిర్మించిన మొట్టమొదటి లగ్జరీ విల్లాగా ఇది నిలిచింది. బబుల్ హోటల్ చైన్ యజమాని ఫెలిక్స్ డెమిన్ ఈ ప్రైవేట్ జెట్ విల్లాను నిర్మించారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై ఈ ప్రైవేట్‌ జెట్ విల్లా ఉంది. ఇందుకు సంబందించిన ఫొటోస్ గతంలో వైరల్ కాగా.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రైవేట్‌ జెట్ విల్లా చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

ఫెలిక్స్ డెమిన్ 2021లో బోయింగ్‌ 737 విమానాన్ని కొనుగోలు చేశారు. ఈ విమానం విడిభాగాలను బాలి ద్వీపం కొండపైకి రవాణా చేయడం, ఆ విడిభాగాలను అసెంబుల్ చేయడం ఓ సవాలుగా మారింది. ఇందుకోసం రెండు క్రేన్లు, 20 మంది వ్యక్తుల బృందం రెండు నెలల పాటు శ్రమించారు. కొండపైకి వెళ్లడం కోసం ప్రత్యేకంగా 600 మీటర్ల రహదారిని వేశారు. మొత్తంగా విమానం రవాణాకు ఐదు రోజులు పట్టింది. రష్యాకు చెందిన ఫెలిక్స్ డెమిన్ పాడుబడ్డ బోయింగ్‌ 737 విమానాన్ని విలాసవంతమైన విల్లాగా మార్చేందుకు ఎన్నో ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నారు.

Also Read: CSK vs RCB: సీఎస్‌కేకు షాక్.. నాలుగో ప్లేఆఫ్స్‌ బెర్తు ఆర్‌సీబీదే?

ఈ ప్రైవేట్ జెట్ విల్లాలో రెండు బెడ్‌ రూమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్‌, విలాసవంతమైన హోటల్‌, బార్, గ్లాస్ పోర్టల్‌తో కూడిన లివింగ్ రూమ్ ఉంటుంది. కాక్‌పిట్‌ను బాత్‌ రూమ్‌లా మార్చారు. సన్ లాంజ్‌లు, అవుట్‌డోర్ లాంజ్ ఏరియా సహా ఫైర్ పిట్ కూడా ఉంది. లివింగ్ రూమ్ నుండి నేరుగా విమానం రెక్కపైకి వెళ్లొచ్చు. విమానంలో ప్రతి స్థలాన్ని ఫెలిక్స్ డెమిన్ తనకు నచ్చినట్లు ఎంతో అందంగా తీర్చిదిద్దారు. సముద్రపు ఒడ్డున నిర్మించిన ఈ విల్లా ఎంతో అనుభూతిని ఇస్తుంది.

Exit mobile version