World Economic Forum: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలంగాణ రాష్ట్రానికి తొలిరోజే కీలక విజయం లభించింది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు అడ్డాగా ఉన్న భాగ్యనగరంలో మరో అంతర్జాతీయ సంస్థ కొలువుదీరనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు చెందిన సీ4ఐఆర్‌కు చెందిన కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పనున్నారు. దావోస్‌లో ఇవాళ ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో దీనికి సంబంధించిన ఒప్పందంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎండీ జెరేమీ జర్గన్స్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ సంతకాలు చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్జ్ బ్రెందేతో పాటు అధికారులు పాల్గొన్నారు. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టే ఈ కేంద్రం దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు కానుండడం గమనార్హం.
BJP : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. @టార్గెట్ 2024
అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కేంద్రం ఏర్పాటు దోహదుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, సత్తాకు ఈ కేంద్రం ఏర్పాటే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పాటు ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సెన్సెస్ రంగం ఎదుగుదల, ఎకో సిస్టం పెంపొందించడానికి తమ ప్రభుత్వం చేపట్టిన ముందడుగుగా ఈ కేంద్రం ఏర్పాటును భావించాలన్నారు.
