వన్డే ప్రపంచ కప్ 2023 తుది దశకు చేరుకుంది. రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడుతుంది. మొత్తం టోర్నీలో భారత జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక, ఆస్ట్రేలియా 10 మ్యాచుల్లో 8 గెలిచి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అయితే, భారత్ మూడో టైటిల్‌పై కన్నేసింది.. మరో వైపు ఆస్ట్రేలియా ఆరోసారి చాంపియన్‌గా అవతరించాలని కోరుకుంటోంది. ఇదిలా ఉంటే మ్యాచ్‌కు ముందు వాతావరణంపై అభిమానులు ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అహ్మదాబాద్‌లో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో వర్షం కురిసి మ్యాచ్ మజాను చెడగొడుతుందా.. లేక పూర్తి 100 ఓవర్ల ఉత్కంఠ మ్యాచ్ కొనసాగుతుందా అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Purandeswari: కంపెనీ పేరు లేకుండా బిల్స్.. అక్రమంగా ఇసుక తవ్వకాలు..!
ఇక, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ నగరంలో విపరీతమైన ఎండలు ఉండబోతున్నాయని వెదర్ డిపార్ట్మెంట్ చెప్పింది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం లేదని సమాచారం. ఈ సమయంలో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సాయంత్రం ఉష్ణోగ్రత తగ్గి.. మంచు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెప్పింది.
Read Also: Minister KTR: సీఎం పోస్ట్ వద్దు.. ఆశాఖే కావాలంటున్నకేటీఆర్
ఇక, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడినా.. ఐసీసీ ఇప్పటికే ఫైనల్ కోసం రిజర్వ్ డేని కేటాయించింది. తర్వాత రోజు ఎక్కడ ఆగిన మ్యాచ్‌ని మరుసటి రోజు కొనసాగించవచ్చు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో రెండు జట్లు గెలవాలనే ఉద్దేశ్యంతో బరిలోకి దిగుతున్నాయి.