NTV Telugu Site icon

World Biryani Day 2024: నేడే ప్రపంచ బిర్యానీ దినోత్సవం.. అసలేంటి ఈ బిర్యానీ డే..

Biryani Day 2024

Biryani Day 2024

World Biryani Day 2024: ప్రపంచంలోని వివిధ దేశాలలో వివిధ రకాల ప్రత్యేక రుచులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కాలానుగుణంగా ప్రజలు ఆసక్తిని గమనించి వివిధ దేశాల్లో దొరికే వంటకాలను ప్రతి దేశంలో తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమైపోతున్నారు. ఇక భారత దేశ ఆహార పద్ధతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంలో కూడా వివిధ రాష్ట్రాలలో ఒక్కోరకమైన ఆహారం ప్రసిద్ధి చెందింది. ఇలా భారతదేశంలో ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన వంటకాల గురించి చెప్పుకోవాలంటే.. బట్టర్ చికెన్, రసగుల్లా స్వీట్, హైదరాబాద్ దమ్ బిర్యాని.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రుచులు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వంటకాలుగా ప్రసిద్ధి చెందాయి. నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇక హైదరాబాదులో తయారు చేసే బిర్యానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది.

AP Home Minister: 9వ తరగతి బాలికను హత్య చేసిన సైకో.. మృతురాలి ఇంటికి ఏపీ హోం మినిస్టర్

వివిధ రకాల బిర్యానీలు చేయడం మన భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి. వెజ్, నాన్ వెజ్ ఇలా చెప్పుకుంటూ పోతే.. అనేక రకాల బిర్యానీలు అందుబాటులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మిలయన్లమంది ప్రజలు పంచుకునే ఓ భావోద్వేగం బిర్యాని. ఈ బిర్యాని దినోత్సవాన్ని జూలై నెలలోనే మొదటి ఆదివారం జరుపుకుంటారు. 2022 నుండి మొదలైన ఈ బిర్యానీ దినోత్సవం ప్రస్తుతం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టింది. దావత్ బాస్మతి రైస్ ఆధ్వర్యంలో ఈ బిర్యాని దినోత్సవాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చారు. 2024 లో మొదటి జూలై నెల ఆదివారం జూలై 7న ప్రపంచ బిర్యానీ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు.. మనలో చాలామంది బిర్యాని తినడానికి రెడీ అయిపోతారు. ఈ ప్రత్యేక సందర్భంలో భారతదేశంలో దొరికే వివిధ రకాల బిర్యానీల గురించి లుక్ వేద్దాం. బిర్యానీలు రుచికరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అందులో ముఖ్యంగా ఏ బిర్యానీలు ప్రసిద్ధి చెందిన ఓసారి చూద్దాం.

YS Jagan: నేడు పులివెందులలో వైఎస్ జగన్.. ప్రజలతో ముఖాముఖి..!

బిర్యానీ లిస్టులో ప్రముఖంగా చెప్పుకునేది హైదరాబాద్ బిర్యాని. భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ హైదరాబాద్ దమ్ బిర్యానికి ఎంతో మంచి పేరు ఉంది. ఐకానిక్ బిర్యానీలో హైదరాబాద్ బిర్యాని ప్రముఖంగా పేరుగాంచింది. బాస్మతి బియ్యంతో అనేక సుగంధ ద్రవ్య సంపూర్ణ సమ్మేళనానికి హైదరాబాద్ బిర్యాని ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు చికెన్ లేదా మటన్ తో తయారు చేసిన ఈ బిర్యానీ ఎంతో ప్రసిద్ధిగాంచాయి. భారతదేశంలో లక్నో బిర్యాని, కోల్కతా బిర్యాని, మలబార్ బిర్యాని, సింధీ బిర్యాని, దొడ్డు బిర్యానిలు ప్రముఖంగా పేరుగాంచాయి. ఇలా వివిధ ప్రదేశాలలో ప్రజలు వారికి రుచికి తగ్గట్టుగా వివిధ సుగంధ ద్రవ్యాలను వాడి వివిధ రుచుల్లో బిర్యానీ ఆస్వాదిస్తుంటారు. భారతదేశవ్యాప్తంగా ఎక్కువమంది ఆస్వాదించే వంటకాలలో బిర్యాని మొదటి స్థానంలో ఉంటుంది.