CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ అయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు. గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తోన్న నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో సమావేశం అయింది. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వారికి వివరించారు.
Read Also: AP CM Chandrababu: స్కూల్ వ్యాన్‌ల ఫిట్ నెస్ పరీక్షలకు సీఎం చంద్రబాబు ఆదేశం
వరల్డ్ బ్యాంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్‌పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలీవియర్, సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్ షెన్, సౌత్ ఏషియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదాలిరజాక్ ఎఫ్.ఖలీల్ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. వారితో పాటు మంత్రి పొంగూరు నారాయణ, మంత్రి టీజీ భరత్, సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కమిషనర్ సీహెచ్.శ్రీధర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.