Site icon NTV Telugu

World Bank: ఛత్తీస్‌గఢ్‌ పాఠశాలల కోసం ప్రపంచ బ్యాంకు భారీ రుణం

World Bank

World Bank

World Bank: ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పెంచేందుకు ప్రపంచ బ్యాంకు పెద్ద అడుగు వేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలల కోసం 300 మిలియన్ డాలర్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఈరోజు ఆమోదించింది. లోన్ మెచ్యూరిటీ వ్యవధి 18.5 సంవత్సరాలు కాగా.. 5 సంవత్సరాల గ్రేస్ పీరియడ్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (IBRD) నుంచి 300 మిలియన్ల అమెరికన్‌ డాలర్ల రుణాన్ని ఛత్తీస్‌గఢ్‌లో నాణ్యమైన విద్య కోసం అందించనుంది. ఇది నిర్దిష్ట ఫలితాల సాధనకు నేరుగా నిధులను పంపిణీ చేస్తుంది.

40 లక్షల మంది విద్యార్థులకు చేకూరనున్న లబ్ధి
ఈ ప్రాజెక్ట్ సుమారు 4 మిలియన్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో ఎక్కువ మంది రాష్ట్రంలోని పేద, బలహీన వర్గాల నుంచి వచ్చినవారికి లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలోని దాదాపు 86 శాతం పాఠశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ప్రైమరీ స్కూల్ స్థాయిలో 95 శాతం నమోదు కాగా, సీనియర్ సెకండరీ స్థాయిలో 57.6 శాతం మాత్రమే నమోదు కాగా, బాలికల కంటే అబ్బాయిల నమోదు 10.8 శాతం తక్కువగా ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.సీనియర్ సెకండరీ స్కూళ్లలో సైన్స్, కామర్స్ విద్య అందుబాటులో లేకపోవడం, శిక్షణ పొందిన సైన్స్, గణిత ఉపాధ్యాయుల కొరత, ప్రయోగశాలలు, సౌకర్యాల వంటి అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే తక్కువ నమోదుకు కారణమని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.

Also Read: Bihar: పెళ్లి వేడుకలో మైక్‌ లో పాట పాడుతూ మహిళ మృతి.. ఏమైందంటే?

మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలు రుణాల నుంచి ప్రయోజనం పొందుతాయి. ఛత్తీస్‌గఢ్ యాక్సిలరేటెడ్ లెర్నింగ్ ఫర్ ఎ నాలెడ్జ్ ఎకానమీ ఆపరేషన్ (CHALK) అనేది అన్ని గ్రేడ్‌లలో విద్యకు ప్రాప్యతను మెరుగుపరచడం, సీనియర్ సెకండరీ స్థాయిలో సైన్స్, కామర్స్ అధ్యయనాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. రుణ సహాయంతో మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లోని మగ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నివాస సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. సీనియర్ సెకండరీ స్థాయిలో సైన్స్, కామర్స్‌ను అందించే 1 నుంచి 12వ తరగతి వరకు 600 మోడల్ కాంపోజిట్ పాఠశాలలను అభివృద్ధి చేయడం, నిర్వహించడంలో ఈ ప్రాజెక్ట్ సహాయం చేస్తుంది. ఈ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్యను అందించనున్నారు.

Exit mobile version