Site icon NTV Telugu

Explosion: స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు.. కార్మికుడు దుర్మరణం

Explosion

Explosion

Explosion at Steel Factory in Rasmara: ఛత్తీస్‌గఢ్‌లోని ఉక్కు ఫ్యాక్టరీలో ఆదివారం పేలుడు సంభవించి కార్మికుడు కాలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. రస్మారాలోని రాయ్‌పూర్ స్టీల్ ప్లాంట్‌లో స్టీల్‌ను కరిగించే పని జరుగుతుండగా పేలుడు సంభవించింది. ఘటనా స్థలంలో కనీసం 100 మందికి పైగా కార్మికులు ఉన్నారు. అక్కడి పలువురికి గాయాలు కాగా.. క్షతగాత్రులను భిలాయ్‌లోని ఆసుపత్రికి తరలించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: Minibus Accident: అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడులో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురిని సెక్టార్ 9 భిలాయ్‌లోని జేఎల్‌ఎన్‌ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు ఖేమ్లాల్ సాహు (38) మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు కార్మికుల పరిస్థితి నిలకడగా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version