Site icon NTV Telugu

Womens T20 World Cup: విండీస్‌తో పోరుకు హర్మన్‌సేన రెడీ..మంధానా వచ్చేసింది!

44

4

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు మంచి శుభారంభం లభించింది. ఈ మెగాటోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌సేన అద్భుత విజయాన్ని సాధించింది. ఇక ఆ మరుసటి రోజే భారత అమ్మాయిలపై కోట్ల వర్షం కురిసింది. విమెన్స్ ప్రిమియర్‌ లీగ్‌ వేలంలో మన అమ్మాయిలు అంచనాలను మించి ధరలు దక్కించుకున్నారు. ఇదే ఉత్సాహంతో టీ20 ప్రపంచకప్‌లో తమ రెండో పోరుకు సిద్ధమయ్యారు. బుధవారం వెస్టిండీస్‌ను ఢీకొట్టనున్న భారత్‌.. వరుసగా రెండో విజయంతో సెమీస్‌ బెర్తు దిశగా మరో అడుగు వేయాలని చూస్తోంది.

Also Read: WPL 2023: విమెన్స్ ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదిగో..తొలి మ్యాచ్ వీరి మధ్యే!

పాక్‌పై కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించి విజయం సాధించడం భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. పైగా ఆ మ్యాచ్‌కు గాయం కారణంగా అందుబాటులో లేని స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధానా.. విండీస్‌పై బరిలోకి దిగనుంది. మరోవైపు విండీస్‌ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ జట్టుపై హర్మన్‌ప్రీత్‌ సేనకు మంచి రికార్డే ఉంది. ప్రస్తుతం భారత్‌ జోరు ముందు విండీస్‌ నిలవడం కష్టమే. పాక్‌పై చెలరేగి ఆడిన జెమీమా, రిచాలపై మంచి అంచనాలున్నాయి. స్మృతి రాకతో బ్యాటింగ్‌ మరింత బలోపేతం కానుంది. కానీ బౌలింగ్‌ విషయంలో మాత్రం భారత్‌కు కంగారు తప్పట్లేదు.

Also Read: Sania Mirza: ఆర్సీబీ మెంటర్‌గా సానియా..అందమంతా ఆ టీమ్‌లోనే!

పాక్‌తో తొలి పది ఓవర్ల వరకు బౌలర్లు ఆకట్టుకున్నా.. తర్వాతి పది ఓవర్లలో ఏకంగా 91 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. స్పిన్నర్‌ రాధా యాదవ్‌ మినహా బౌలర్లందరూ ధారాళంగా పరుగులిచ్చేశారు. కొన్ని మ్యాచ్‌ల నుంచి పేసర్‌ రేణుకా సింగ్‌ సత్తా చాటలేకపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. వార్మప్‌ మ్యాచ్‌ల్లో సత్తా చాటిన అనుభవజ్ఞురాలు శిఖాను.. రేణుక లేదా పూజ స్థానంలో తుది జట్టులో తీసుకుంటారేమో చూడాలి. స్పిన్నర్లు దీప్తి, రాజేశ్వరి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరముంది. విండీస్‌ ఎక్కువగా కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ మీద ఆధారపడుతోంది. బ్యాటింగ్‌లో ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది.

Also Read: Man Kills Partner: ప్రియురాలిని హత్య చేసి పరుపులో మూటకట్టేశాడు..

Exit mobile version