India vs West Indies Women Match: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (52; 40 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. యస్తిక భాటియా (24), స్మృతి మందాన (14) రన్స్ చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ నాలుగు వికెట్లు పడగొట్టింది.
లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులకే పరిమితమైంది. చీనిల్ హెన్రీ (59; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేసింది. అఫీ ఫ్లెచర్ (21), షెమైన్ కాంప్బెల్లే (20) రన్స్ చేశారు. భారత బౌలర్లలో పూజ వస్త్రకర్ 3, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో భారత జట్టులో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది.
Also Read: Rohit Sharma Fitness: ఇన్ని మ్యాచ్‌లు ఎలా ఆడగలిగా.. రోహిత్ శర్మ ఘాటు వ్యాఖ్యలు!
భారత జట్టు మంగళవారం రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళలతో భారత జట్టు తలపడనుంది. గురువారం నుంచి మహిళల ప్రపంచకప్ ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మహిళలు తలపడనున్నారు. అక్టోబర్ 4న భారత్ తన ప్రయాణం మొదలెట్టనుంది.