Women’s ODI WC winners: ఎట్టకేలకు మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసి.. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు హర్మన్‌ప్రీత్ సేన తెరదించింది. ఈ విజయంతో భారత దేశం మొత్తం సంబరాల్లో మునిగితేలుతోంది. తొలిసారి ప్రపంచకప్ నెగ్గిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే భారత్ మొదటిసారి ప్రపంచకప్ గెలవగా.. ఆస్ట్రేలియా అత్యధిక సార్లు ట్రోఫీని ముద్దాడింది. ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమ్స్ లిస్ట్ ఓసారి చూద్దాం.
ఆస్ట్రేలియా ఏకంగా 7 సార్లు వన్డే ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది. 1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022లలో ఆసీస్ మెగా టోర్నీని ముద్దాడింది. ఇంగ్లండ్ నాలుగు సార్లు 1973, 1993, 2009, 2017 కప్ సొంతం చేసుకుంది. 1973లో మొట్టమొదటి వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లీష్ జట్టే కైవసం చేసుకుంది. న్యూజీలాండ్ (2000), భారత్ (2025)లు ఒక్కోసారి ప్రపంచకప్ గెలుచుకున్నాయి. భారత పురుషుల జట్టు రెండుసార్లు (1983, 2011) రెండుసార్లు కప్ కొట్టిన విషయం తెలిసిందే. ఆసీస్ పురుషుల జట్టు ఆరుసార్లు ప్రపంచకప్ గెలుచుకుంది. మహిళా, పురుష జట్లలో ఆస్ట్రేలియాదే టాప్ ప్లేస్. ఆసీస్ జట్టుకే ఇన్ని కప్స్ ఎలా సాధ్యం అని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Sudheer Babu: సుధీర్ బాబు అంటే ఎవరు?.. నిజం ఒప్పుకోవడానికి గట్స్ ఉండాలి!
మహిళల వన్డే ప్రపంచకప్ విజేతలు:
7 – ఆస్ట్రేలియా (1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022)
4 – ఇంగ్లాండ్ (1973, 1973, 2005, 2017, 2017)
1 – న్యూజిలాండ్ (2000)
1 – భారతదేశం (2025)
