NTV Telugu Site icon

Green India Challenge:’ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌’ పోస్టర్ విడుదల

Green India Challenge

Green India Challenge

Green India Challenge: పిల్లలను పెంచే చేతులే మొక్కలు నాటితే ప్రకృతి మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ అన్నారు.మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం రోజున తమ పిల్లలపై చూపిన ప్రేమానురాగాలతో మహిళా సంఘం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.’గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ప్రత్యేక కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొని ప్రకృతి పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆకాంక్షించారు. అంతేకాకుండా మహిళా దినోత్సవం సందర్భంగా విరివిగా మొక్కలు నాటాలని మహిళా ఉద్యోగులందరికీ ఆమె సూచించారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మహిళలు శక్తివంతులని,వారు చేపట్టిన పనులను విజయవంతంగా సాధిస్తారని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి మహిళ, విద్యార్థిని పాల్గొనేలా తనవంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు.

Read Also: Manik Rao Thakre : పోలీసులు దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూనే భూ పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. సాలుమరాడ తిమ్మక్క స్ఫూర్తితో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతి మహిళ మొక్కలు నాటాలని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం నిస్వార్థ కార్యక్రమమని రేపటి తరానికి ఉపయోగపడుతుందని ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో ప్రతి మహిళ భాగస్వాములు కావాలని ఆమె సూచించారు.