Site icon NTV Telugu

Manipur: మణిపూర్లో పోలీసులది ప్రేక్షకపాత్ర.. అల్లరిమూకలకే సహకరించారు..

Cbi

Cbi

దేశవ్యాప్తంగా మణిపుర్‌ రాష్ట్రంలో హింసాత్మక దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడంతో పాటు సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకపోగా.. అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ తన ఛార్జిషీటులో తెలిపింది. కాంగ్‌పోక్పీ జిల్లాలో మైతీ మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీతెగ మహిళలను పోలీసు సిబ్బందే అల్లరిమూకలకు అప్పగించినట్లు ఛార్జిషీటులో పేర్కొనింది.

Read Also: Guess the Actress: ఈ ఫోటో ఎవరిదో గుర్తుపట్టారా? సౌత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది!

కాగా, ఆ తర్వాతే ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సీబీఐ తన ఛార్జిషీటులో వివరించింది. బాధితురాళ్లలో ఒకరు తమను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించాలని కార్గిల్‌ యుద్ధవీరుడి భార్య పోలీసులను కోరగా.. ‘జీపు తాళాలు లేవు’ అని వారు తప్పించుకున్నట్లు చెప్పుకొచ్చింది. అల్లరిమూకల చేతికి చిక్కిన మూడో మహిళ ఈ అఘాయిత్యం నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. గతేడాది మే 4వ తేదీన జరిగిన ఈ ఘటన జులై నెలలో వైరల్‌గా మారి దేశమంతా కుదిపేసింది.

Read Also: Amit Shah: అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. 8 రాష్ట్రాల్లో 16 మందికి నోటీసులు

ఈ అకృత్యాలపై ఆరుగురు నిందితులతో పాటు ఓ బాల నేరస్థుడిపై గువాహటిలోని సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16వ తేదీన ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ దాడుల్లో అల్లరిమూకల చేతిలో మృతి చెందిన కుకీ తెగ తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరు లేని నదిలోకి పడేసినట్లు చెప్పారు. మైతీ అల్లరిమూకలు పోలీస్ జీపు దగ్గరకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి పోలీసులు పారిపోయినట్లు సీబీఐ తన మూడు పేజీల ఛార్జిషీటులో వెల్లడించింది. పైగా సాయం చేయమని అర్థించిన ఓ మహిళను పోలీసులు తోసివేసినట్లు చెప్పుకొచ్చింది.

Exit mobile version