NTV Telugu Site icon

MP: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళలు..వారిపై మొరంవేసి సజీవ సమాధికి యత్నం

Mp

Mp

మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రేవాలో ప్రైవేట్ భూమిలో బలవంతంగా రహదారిని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు మహిళలను రౌడీలు సజీవ సమాధి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమీపంలోని వ్యక్తులు సహాయం చేయడానికి పరిగెత్తారు. వారిద్దరి మీద పడిన మట్టిని తొలగించి బయటకు తీశారు. వారిని ఆస్పత్రికి తరలించారు.

READ MORE: Ajit Pawar: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది..

ఈ ఘటన రేవా జిల్లా మంగవాన్ పోలీస్ స్టేషన్ పరిధి.. గగేవ్ ఔట్‌పోస్టు పరిధిలోని హినౌతా జోరౌట్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇక్కడ కొందరు రౌడీలు ప్రైవేటు భూమిలో బలవంతంగా రోడ్డు నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో ఒక జేసీబీ, రెండు టిప్పర్లు వినియోగించి ప్రైవేటు స్థలంలో మొరం వేస్తున్నారు. భూ యజమానులైన మమతా పాండే, ఆశా పాండే ఈ విషయాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. ప్రైవేట్ భూమిలో రోడ్డు వేయడాన్ని నిరసిస్తూ ఇద్దరు మహిళలు రోడ్డు నిర్మాణ స్థలం వద్ద నిలబడి నిరసన తెలిపారు. అప్పుడు డంపర్ డ్రైవర్ ఈ మహిళలపై మొరాన్ని గుమ్మరించాడు. మహిళలు ఒక్కసారిగా మొరంలో కూరుకుపోయారు. సమీపంలో ఉన్న వ్యక్తులు వెంటనే మట్టిని తొలగించి లోపల నుంచి మహిళలను బయటకు తీసి చికిత్స కోసం గంగేవ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. మహిళలకు ప్రథమ చికిత్స చేశారు వైద్యులు. మట్టిలో కూరుకున్న వారిని సరైన సమయంలో బయటకు తీయకుంటే ప్రాణాలు పోయేవని ప్రజలు వాపోయారు. మంగవా పోలీస్ స్టేషన్ పరిధిలోని హినోటా జోరోట్ గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

Show comments