NTV Telugu Site icon

Women Health: డెలివరీ తర్వాత ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు..!

Aftr Dlvry

Aftr Dlvry

ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ తల్లి మరో జన్మ ఎత్తినట్లు.. బిడ్డ కడుపులో పడక ముందు ఎంత ఆరోగ్యంగా ఉంటారో.. బిడ్డ కడుపున పడిన నాటి నుంచి డెలివరీ అయ్యేవరకు ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి..ప్రసవం తర్వాత మహిళలు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. డెలివరీ తర్వాత వారిలో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. డెలివరీ టైమ్‌లో రక్తం పోవడం, ఒత్తిడి, మానసిక ఆందోళన… లాంటి కారణాల వల్ల మహిళలు నీరసించి పోతారు. చాలామందిని మలబద్ధకం, మూత్రవిసర్జన సమయంలో మంట వంటి సమస్యలూ ఇబ్బంది పెడతాయి. బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం వంటి ప్రాబ్లమ్స్‌ కామన్‌.. తల్లి, బిడ్డా ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మెంతుల్లో ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి తల్లికీ బిడ్డకీ కూడా మంచివి. పప్పుల్లో, కూరల్లో కొంచెం మెంతి పొడి వేసుకోవచ్చు. మెంతులతో టీ కూడా చేసుకుని తాగొచ్చు. మెంతులు తల్లి పాలను పెంచుతాయి..

కిచిడి.. దీన్ని అన్నం పప్పుతో తయారు చేస్తారు..డెలివరీ తర్వాత మహిళలు కచ్చితంగా ఇది, వారి డైట్‌లో చేర్చుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కిచిడీ, సులభంగా జీర్ణం అవుతుంది. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి.. పప్పు ప్రోటీన్స్ ను అందిస్తుంది..

ఇక పిల్లలకు పాలిచ్చే తల్లులు ఆహారంలో వాల్‌నట్‌లు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుకోవాలి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పును ఆహారంలో చేసుకోవాలనుకుంటే రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. పోషకాలు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్ శరీరానికి బలాన్ని అందిస్తాయి. ఎన్నో పోషకాలను అందిస్తుంది..

పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, డైరీ, బీన్స్, గింజలు, విత్తనాలు వంటి ప్రోటీన్ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే ముదురు ఆకుపచ్చ, పసుపు కూరగాయలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో హోల్‌ వీట్‌ రొట్టెలు, పాస్తా, తృణధాన్యాలను డైట్ లో భాగం చేసుకోవాలి..

అలాగే అల్లం.. అల్లం జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, వాపును తగ్గిస్తుంది. అల్లంలో శక్తివంతమై.. యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. అల్లంలో దాదాపు 40 యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ ఉంటాయి.. కండరాలు టైట్ అవ్వడంలో అల్లం సహాయ పడుతుంది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు..