Hungary Govt: ఓ వైపు ప్రపంచ జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంటే.. కొన్ని దేశాలను జననాల క్షీణత సమస్య తీవ్రంగా వేధిస్తుంది. ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లతో అక్కడి యువత పెళ్లిళ్లపై ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో భవిష్యత్ తరం పూర్తిగా తగ్గిపోతోంది. దీంతో వలసలపై ఆధారపడాల్సి పరిస్థితి ఏర్పాడింది. ఐరోపా దేశం హంగేరీలో ప్రస్తుతం ఇలాంటి సమస్యనే కొనసాగుతుంది. దీంతో జనాభాను పెంచేందుకు ఆ దేశ ప్రభుత్వం అద్భుతమైన ఆలోచన చేసింది. ఇందులో భాగంగానే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
Read Also: Prabhas : యూరప్ కు వెళ్ళబోతున్న ప్రభాస్ .. సినిమా కోసం కాదు..
కాగా, ఐరోపాలో జననాల రేటు చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో జనాభాను పెంచేందుకు వలసదారులను ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో హాంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్ వినూత్న ఆలోచనతో కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మందిని కనే మహిళలకు తమ జీవితకాలం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లు కొనుగోలు చేసేందుకు సబ్సిడీని కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే, పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21 వేల క్రెచ్‌లను స్టార్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి మినహాయింపులతో పెళ్లిళ్లు, కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించినట్లవుతుందని హాంగేరి ప్రభుత్వం తెలిపింది.
Read Also: Bugatti Car Price: గంటకు 445 కిలోమీటర్ల వేగం.. బుగాటి కారు ధర ఎంతో తెలుసా?
అయితే, గతంలోనూ హంగేరీ ప్రభుత్వం ఇలాంటి ఆఫర్లు ప్రకటించింది. 2019లోనే పెళ్లిళ్లు, జననాల రేటును పెంచేందుకు ఓ స్కీమ్‌ను తీసుకొచ్చింది. అందులో 41 ఏళ్లలోపు పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్ ఫోరింట్స్ (హంగేరీ కరెన్సీ) సబ్సిడీ రుణాలు అందిస్తామన్నారు. పెళ్లైన తర్వాత ఆ మహిళ ఇద్దరు పిల్లలను కంటే రుణంలో మూడోవంతును మాఫీ చేస్తాం.. ఒకవేళ ముగ్గురి కంటే ఎక్కువ పిల్లలకు జన్మనిస్తే.. మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం హంగేరీ జనాభా 96. 4 లక్షలుగా ఉంది.