Women blackmailed and harassed by finance businessman
అవకాశాన్ని ఆసరాగా చేసుకొని స్త్రీలపై తమ కామవాంఛ తీర్చుకోవడానికి పూనుకుంటున్నారు. కోర్టులు కఠిన శిక్షలు విధించినా కామాంధుల వెన్నులో మాత్రం వణుకుపుట్టడం లేదు. యథేచ్ఛగా సందు దొరికితే చాలు.. స్త్రీలను ఏరకంగా లొంగదీసుకుందామా.. అనే ధోరణిలో ఉన్నారు కొందరు. అలాంటి ఘటనే ఇది. వ్యాపార అవసరాల కోసం వ్యాపారిని ఓ వివాహిత అప్పు అడిగితా.. అప్పు ఇస్తాను గానీ.. గెస్ట్ హౌస్ కు వస్తావా.. లేకుంటే న్యూడ్ వీడియో కాల్ చేస్తావా అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో.. నివ్వెరపోయిన సదరు వివాహిత చేసేదేమీ లేక.. న్యూడ్ కాల్ చేసింది. అయితే సదరు వ్యాపారి ఆ న్యూడ్ వీడియో కాల్‌ను రికార్డ్ చేయడమే కాకుండా.. తన బంధువుకు పంపించాడు. అయితే.. ఆ బంధువు కాస్త.. ఆ వీడియో పోర్న్ సైట్‌లో పెట్టి.. వివాహితను బ్లాక్ మెయిల్ చేయడంతో విసిగిపోయిన వివాహిత పోలీసులుకు ఫిర్యాదు చేసింది.
దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రాజమండ్రికి చెందిన ఓ మహిళ..తన వ్యాపార అవసరాల కోసం ఫైనాన్స్ వ్యాపారి హర్ష కుమార్ జైన్ కొంత నగదు అప్పుగా అడిగింది. అయితే.. గెస్ట్ హౌస్ రావాలని లేదా న్యూడ్ వీడియో కాల్ చేయాలని షరతు పెట్టాడు. దీంతో.. ఆ మహిళ తప్పనిపరిస్థితుల్లో న్యూడ్ వీడియో కాల్ చేసింది. స్క్రీన్ రికార్డు చేసిన నిందితుడు హర్ష కుమార్ జైన్ ఆ వీడియోను విజయవాడ కానూరులోని తన బంధువు చందుకు షేర్ చేశాడు. అయితే.. అతడు ఆ వీడియో పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేసి బాధిత మహిళను బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో బాధిత మహిళ మచిలీపట్నం దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు దిశ డీఎస్పీ రాజీవ్ కుమార్ తెలిపారు.