Hyderabad: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ కిస్మత్‌పూర్‌లో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహంపై బట్టలు లేకపోవడంతో ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉండడంతో హత్య జరిగి రెండు మూడు రోజులు అయి ఉండవచ్చునని భావిస్తున్నారు.
Kishkindhapuri: అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్!
మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కిస్మత్‌పూర్ బ్రిడ్జి కింద మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో తన బృందంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం, ఫింగర్‌ప్రింట్స్ నిపుణులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పలు ఆధారాలను సేకరించారు. ఇక ఈ కేసులో పోలీసుల అనుమానం ప్రకారం, దుండగులు మహిళను కిస్మత్‌పూర్ బ్రిడ్జి కిందకు తీసుకొచ్చి అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతురాలి వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా.
Khammam : ఖమ్మం జిల్లా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఆగ్రహం
ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం దొరికిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా, మృతురాలు ఎవరు? ఆమెను ఎవరు హత్య చేశారనేది తెలుసుకునేందుకు సమీపంలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులను కూడా పరిశీలిస్తున్నామని ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు. త్వరలోనే కేసును చేదిస్తామని ఆయన స్పష్టం చేశారు.
