NTV Telugu Site icon

Viral Video: టిక్కెట్టు లేకుండా రైలులో జర్నీ.. అడిగినందుకు టీటీఈపై దాడి

Train

Train

సాధారణంగా రైలులో ప్రయాణం చేసేటప్పుడు.. టికెట్ తీసుకుని ప్రయాణించాలి. ఒకవేళ టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. అప్పుడు రైలులో టీటీఈ వస్తే జరిమానా విధిస్తాడు. అప్పుడు చచ్చుకుంటూ అది కట్టాల్సిందే. లేదంటే.. జైలు శిక్ష విధిస్తారు. అయితే.. ఓ మహిళ టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తుంది. టీటీఈ వచ్చి టికెట్ అడగ్గా.. కొద్దిసేపు వాగ్వాదం పెట్టుకుంది. అనంతరం.. రైలు దిగిన తర్వాత టీటీటీపై దాడి చేసింది.

PM-AASHA : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పథకానికి రూ. 35,000 కోట్లు కేటాయింపు

వివరాల్లోకి వెళ్తే.. సీమాంచల్ ఎక్స్‌ప్రెస్‌లోని 2వ ఏసీ కోచ్‌లో టికెట్ లేకుండా ఓ మహిళ ప్రయాణిస్తుంది. ఆమె ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్తుంది. న్యాయవాది అని చెప్పుకుంటున్న మహిళ టికెట్ లేకుండా రైలులోని సెకండ్ ఏసీలో ప్రయాణిస్తోంది. ఇంతలో టీటీఈ వచ్చి టికెట్ అడగ్గా ట్రైన్‌లో తీవ్ర గందరగోళం సృష్టించింది. తన పేరు చెప్పమని అడగ్గా.. చెప్పేందుకు నిరాకరించింది. టీటీఈతో పాటు తోటి ప్రయాణికులతో తీవ్ర వాగ్వాదానికి దిగింది. టిక్కెట్ ఏది అడగగా.. అర్థంలేని సమాధానాలు చెప్పింది. చాలా సేపు నానా హంగామా చేసింది. దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే.. ఈ వ్యవహారాన్ని మొత్తం టీటీఈ తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు.

Bhadradri : భద్రాద్రి దేవాలయం పేరును ఉపయోగించి అమెరికాలో విరాళాలు

వీడియోలో.. టికెట్ కోసం అడుగుతున్నప్పుడు, రైలులోని లెట్రిన్ బాత్‌రూమ్ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని.. ముందు దానిని మరమ్మతు చేయమని మహిళ టీటీఈకి చెబుతుంది. అంతేకాదు, తన టిక్కెట్టు నువ్వే చింపివేసినట్లు టీటీఈనే నిందిస్తుంది. అందుకే టిక్కెట్టు చూపించలేకపోతున్నానని తెలిపింది. టీటీఈ సీరియస్‌గా తన సీటు నంబర్‌ను అడుగుతాడు. ఈ క్రమంలో.. ఆ మహిళ టీటీఈని కోర్టుకు తీసుకెళ్తానని బెదిరిస్తోంది. మరుసటి రోజు ఉదయం కతిహార్ స్టేషన్‌కు చేరుకోగానే, ఆ మహిళను రైల్వే పోలీస్ ఫోర్స్ ద్వారా రైలు నుండి కిందకు దింపారు. దీంతో.. కోపంతో రగిలిపోయిన మహిళ.. టీటీఈపై దాడి చేసింది. ఈ క్రమంలో.. కతిహార్ రైల్వే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.. ప్రస్తుతం వారు మహిళను గుర్తించే పనిలో ఉన్నారు.

Show comments