NTV Telugu Site icon

Crime News: ఫామ్ హౌస్‎లో మహిళ హత్య .. భర్తే చంపేశాడా..?

Crime News: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్ల పల్లి గ్రామంలో ఫామ్ హౌస్ లో మహిళ దారుణ హత్యకు గురైంది. ఫామ్ హౌస్ లో కాపలాగా ఉండే మహిళను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది.. భర్త ఒక్కడే ఉండడంతో ఆయనే చేసి ఉంటారా.. శుక్రవారం రాత్రి కందుకూరు మండల పరిధిలోని దాసర్లపల్లిలో మహిళ హత్య పై పోలీసుల మనసులో మెదులుతున్న ఆలోచనలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డి- శైలజా రెడ్డి దంపతులు దాసర్లపల్లి సమీపంలో ఫామ్ హౌస్ లో పనిచేస్తున్నారు.

Read Also: Nitro Star: ‘మామా మశ్చీంద్ర’ నుండి పరశురామ్ క్యారెక్టర్ లుక్ రిలీజ్

శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో శైలజ రెడ్డి ఒంటరిగా ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమెను కత్తితో పొడిచి చంపారని కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీస్ సిబ్బంది పలువురు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. హత్య జరిగిన సమయంలో మృతురాలి భర్త ఒక్కడే ఉండడం కూడా పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇతరులు ఎవరు వచ్చి చంపారని చుట్టుపక్కల ప్రదేశాలు సీసీటీవీ ఫుటేజ్ వారి కదలికలపై ఆధారంగా కందుకూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మహేశ్వరం డిసిపి చింతమనేని శ్రీనివాస్ ,ఏసీపి అంజయ్య ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దింపి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Show comments