NTV Telugu Site icon

Woman Drinker : దేంట్లో మేం తక్కువ.. తాగుతాం.. తాళాలు పగలకొడతాం

Woman

Woman

Woman Drinker : మహిళలు మేం తక్కువకాదంటూ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ ప్రస్తుతం దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువ సందర్భాల్లో తాగుడుకు బానిసైన పురుషులే మందు కోసం ఎంతకైనా దిగజారుతారని అనుకున్నాం. ఈ క్రమంలో చాలా సందర్భాల్లో పురుషులే రాత్రి సమయాల్లో లిక్కర్‌ షాపులను షటర్లను ధ్వంసం చేసి దొంగతనానికి పాల్పడిన ఘటనలు చాలానే చూశాం. కానీ, ఇక్కడ ఓ మహిళ వైన్స్ షాపులో దొంగతనానికి ప్రయత్నించింది. తాను దొంగతనానికి యత్నిస్తుండగా సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.  వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో రాత్రివేళ ఓ మహిళ దొంగతనానికి పాల్పడింది. లిక్కర్‌ కోసం ఏకంగా వైన్‌ షాపునే టార్గెట్‌ చేసిన మహిళ తాళం వేసి ఉన్న షటర్‌ను పగులగొట్టేందుకు గునపంతో తీవ్రంగా ప్రయత్నించింది. పెద్ద రాడుతో లిక్కర్‌ షాపు వద్దకు వచ్చిన సదరు మహిళ.. తాళం పగులగొట్టేందుకు బాగా శ్రమించింది. షాపు తాళం ఎంతకు పగలకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైంది. ఈ క్రమంలో అటుగా వస్తున్న పోలీసు పెట్రోలింగ్‌ వాహనం సౌండ్‌ విని అక్కడి నుంచి పారిపోయింది. ఇదంతా షాపు బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అ‍య్యింది. ఇప్పుడు ఇదే వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.