లోకల్ ట్రైన్ లో ప్రయాణించే కొందరు వ్యక్తులు తమ ఆనందం కోసం రకరకాలు ఫీట్లు చేస్తుంటారు. పొరపాటున ఎదైనా జరిగితే.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అలా ఎవరైనా ఎదురించి ఇది తప్పని చెబితే.. వారి పైకి దాడులు చేస్తారు. వీళ్ల చేసే పనులతో మిగతా ప్రయాణీకులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Also:Mass Festival: ఇదేక్కడి దీపావళి పండగరా బాబు… మరీ ఇలా కూడా చేసుకుంటారా
లోకల్ ట్రైన్ లో చీర కట్టుకుని ప్రయాణిస్తున్న ఒక మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె కదులుతున్న రైలులో డోర్ దగ్గరగా నిలబడింది. అనంతరం ఎదురుగా వస్తున్న మరో రైలుపై రాళ్ళు విసురుతుంది. మహిళ వింత ప్రవర్తనతో ఒక్కసారిగా ప్రయాణీకులు అవాక్కయ్యారు. ఆమె రాళ్లు విసిరే దృశ్యం చూస్తూ.. ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. రాళ్లు విసురుతుండగా.. అకస్మాత్తుగా ఆమె తన చేతిలో పట్టుకున్న రాయిని నేరుగా లోకో పైలట్ సీటు వైపు, అంటే రైలు ముందు విండ్‌షీల్డ్ వైపు విసిరింది. .ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు మహిళపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Read Also:IVF: ముసలోడే కానీ.. 93ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న తాత
వీడియో చూసిన నెటిజన్లు ఆమె చేసిన పని చాలా పెద్ద తప్పు అని.. అంతేకాకుండా ప్రాణాంతకమని మండిపడ్డారు.. ఆమె విసిరిన రాయి రైలు కిటీకి దగ్గరలోని గ్లాస్ కు తగిలి.. అనంతరం లోపల ఉన్న ప్రయాణీకులకు తగిలితే.. ఎంత ప్రమాదం జరిగేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రైల్వే పోలీసులు ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Wtf
pic.twitter.com/F0FpmGPZdU— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2025
