సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అయిన తరువాత ఈ మధ్య ఏం జరిగినా వాటిల్లో దర్శనమిస్తున్నాయి. దొంగతనాలకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొంత మంది దొంగతనం చేసే తెలివితేటలు చూసి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. దొంగతనం చేసి కొంతమంది తప్పించుకొని పారిపోతే మరి కొందరు జనాలకు చిక్కి తన్నులు తింటూ ఉంటారు. అలాగే షాపుకు వచ్చి బిల్లు కట్టకుండా తప్పుడు అడ్రస్ ఇచ్చి తప్పించుకున్న మహిళను ఆమె ఇంటికి వెళ్లి పట్టుకున్నారు. కొంత మంది మహిళలు ఆమెను దొంగతనం గురించి ప్రశ్నిస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తుంది. దొంగతనం చేసిన మహిళను పట్టుకోగా ఆమె చేతులతో తన ముఖాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది.
Also Read: Sugar Price Hike: చక్కెర ధరల నియంత్రణకు ప్రభుత్వ చర్యలు.. ప్రతి సోమవారం స్టాక్ ప్రకటించాలి
వివరాల ప్రకారం ఓ మహిళ షాపుకు వెళ్లి రూ.15,000 విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసింది. డబ్బు చెల్లించకుండా ఆ మహిళ సుప్రీంకోర్టు న్యాయవాది భార్యను అని చెప్పి తన ఇంటి అడ్రస్ తప్పుగా ఇచ్చింది. ఇంటికి వచ్చి డబ్బు తీసుకోవాలని చెప్పింది. ఈ విధంగా షాపు వారిని నమ్మించి ఆమె అక్కడి నుంచి ఉడాయించింది. ఆమె తప్పుడు అడ్రస్ ఇచ్చిందని తెలుసుకున్న షాపు వారు ఆమెను ఎలాగోలా పట్టుకున్నారు. అయితే ఆ మహిళ క్షమించమని వారిని వేడుకుంది. అంతేకాకుండా వీడియో తీస్తుండగా ఎవరికి కనిపించకుండా ఆమె తన ముఖాన్ని కూడా కప్పుకుంది. ఇక దొంగతనం చేయడానికి వచ్చినప్పుుడు ఆ మహిళ రెండు మూడు టాప్ లు ధరించి వచ్చింది. అంటే దొంగతనం చేసి పారిపోయేటప్పుడు వెంటనే టాప్ ను మార్చేసి పారిపోవాలని ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చింది. ఈ వీడియోను జానీ భయ్యా అనే ఎక్స్( ట్విటర్) ఖాతాలో గ్రేటర్ నోయిడా వెస్ట్ సొసైటీలో స్కామర్ పట్టుబడింది అనే శీర్షిక జోడించి పోస్ట్ చేశారు.
Scammer caught in Greater Noida West society.@NCMIndiaa pic.twitter.com/pLK01kk6Ac
— Johnny Bhaiya (@jdddn005) September 19, 2023