NTV Telugu Site icon

DNA Test: డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకున్న బాయ్ ఫ్రెండ్.. బట్టబయలైన సీక్రెట్

Woman

Woman

DNA Test: ఎవరైనా తమాషా చేయడం మామూలే. ప్రతి ఒక్కరూ చేస్తారు.. కానీ చాలా సార్లు కొంతమందికి జోకులు నచ్చవు. చిన్న చిన్న విషయాలు రచ్చగా మారుతాయి. చాలా సార్లు సరదాగా కూడా మనుషుల మధ్య గొడవలు మొదలవుతాయి. ప్రస్తుతం ఓ జోకుకి సంబంధించిన మ్యాటర్ ప్రస్తుతం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్పటి వరకు గర్ల్‌ఫ్రెండ్-బాయ్ ఫ్రెండ్ మధ్య సంబంధం బాగానే ఉంది. అయితే, ఒక రోజు సరదాగా అబ్బాయి తన డిఎన్‌ఎ టెస్ట్ చేయించుకున్నాడు. దీంతో వారి మధ్య బంధానికి బీటలు వారాయి. అంతే సిచ్చేయేషన్ మొత్తం తలకిందులైపోయింది.

Read Also:Telangana Congress: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్.. 26న చేవెళ్ల సభలో వైఖరి తేల్చనున్న కాంగ్రెస్

ఈ మొత్తం సంఘటనను అమ్మాయి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో పంచుకుంది. డిఎన్‌ఎ పరీక్ష చేసిన తర్వాత తన ప్రియుడు తనతో ఎలా విచిత్రంతగా ప్రవర్తించాడో వివరించింది. అతని డిఎన్‌ఎ పరీక్ష ఫలితాలు తమ సంబంధానికి ముగింపు పలికాయని పేర్కొంది. తన 27 ఏళ్ల ప్రియుడు సరదాగా డీఎన్‌ఏ కిట్‌ని ఉపయోగించి తన డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకున్నాడని అమ్మాయి చెప్పింది. ఈ పరీక్షలో అతని వంశం రాజకుటుంబానికి చెందనదిగా తేలింది. ఇది అతనికి చాలా సంతోషాన్ని కలిగించింది. కానీ ఆ తర్వాత అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. వారి సంబంధం దెబ్బతినడం ప్రారంభమైంది. అమ్మాయి మాట్లాడుతూ.. ‘9 టు 5’ జీవితం అతనికి సరిపోదని పేర్కొంటూ తన బాయ్ ఫ్రెండ్ అకౌంటెంట్ ఉద్యోగం మానేయడంతో పరిస్థితులు మారాయి.

Read Also:Kitchen Tips : పప్పులు పురుగు పట్టకుండా ఎక్కువకాలం ఉండాలంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!

ఈ విషయం ఇంతటితో ఆగలేదని ఆ మహిళ తెలిపింది. ఇంతకుముందు కండోమ్ లేకుండానే తనతో శారీరక సంబంధం పెట్టుకునేవాడని.. ఎప్పుడైతే డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నాడో తర్వాత అకస్మాత్తుగా కండోమ్ వాడాలని పట్టుబట్టాడని ఆమె తెలిపింది. ఇది మాత్రమే కాదు…నువ్వు ‘నా జన్యువులను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు’ అని కొన్నిసార్లు అంటూ ఆమెపై ఆగ్రమం వ్యక్తం చేసేవాడట. ప్రస్తుతం తమ రిలేషన్ షిప్ టెన్షన్ గా మారిందని ఆ అమ్మాయి చెప్పింది. దీనితో పాటు ఈ సమయంలో తన మనస్సులో ఏం జరుగుతుందో తెలియక తాను నిజంగా గందరగోళానికి గురయ్యాను అని యువతి చెప్పింది.