Kitchen Tips : పప్పులు పురుగు పట్టకుండా ఎక్కువకాలం ఉండాలంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పప్పుల ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు.. అందుకే చాలా మంది ఒకేసారి కొని పెట్టుకుంటారు.. ఏడాదికి సరిపడా పప్పుధాన్యాలను ఒకేసారి కొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అవి పాడవ్వకుండా, పురుగులు పట్టకుండా జాగ్రత్తగా ఎయిర్ టైట్ డబ్బాల్లో స్టోర్ చేస్తూ ఉంటారు, తడి చేతులతో తాకరు. అయినా కూడా కొన్నిసార్లు పప్పులు, బియ్యం పురుగులు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. పప్పులు, బియ్యానికి పురుగులు పట్టకుండా రక్షించుకోవచ్చు… ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వెల్లుల్లిని వాడటం మంచిది..పప్పుల డబ్బాలో కొన్ని పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పప్పులకు పురుగులు పట్టకుండా ఉంటాయి. మీరు పప్పుల పెట్టెలో 4-5 వెల్లుల్లి రెబ్బలను ఉంచండి. ఆవి ఎండిపోయిన తర్వాత, అవి తీసి మీరు ఫ్రెష్ వెల్లుల్లి రెబ్బలు పెట్టండి..
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
అలాగే ఎండు వేపాకులను వాడటం అనేది ఎన్నో ఎళ్లుగా ఫాలో అయ్యే పద్ధతి. ఇది పప్పులను పురుగులు పట్టకుండా రక్షించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. మీరు పప్పులు, బియ్యం స్టోర్ చేసే డబ్బాలో ఎండిపోయిన వేప ఆకులను ఉంచండి. ఇది పప్పుధాన్యాలలో కీటకాలు రాకుండా రక్షిస్తుంది. పప్పులే కాదు, అలమారాల్లో ఎండు వేప ఆకులను ఉంచితే సిల్వర్ ఫిష్ పురుగులు రాకుండా ఉంటాయి..
లవంగాలను వంట రుచి పెంచడానికి వాడుతుంటాం. ఇవి పప్పుధాన్యాలను పురుగులు పట్టకుండా రక్షిస్తాయి కూడా. మీరు చేయాల్సిందల్లా పప్పులు స్టోర్ చేసిన డబబ్బాలో 8-10 లవంగాలు వేసిన క్లాత్ బ్యాగ్ ఉంచండి. ఆ డబ్బాకు గాలి చొరబడకుండా చూసుకోండి..
మీ పప్పు దినుసులు ఉంచిన డబ్బాలో 3 ఎండుమిరపకాయలు ఉంచండి. ఎండు మిర్చీ ఘాటుకు పురుగులు పట్టకుండా ఉంటాయి..
పప్పులను ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే పురుగుల నుంచి పప్పుల నుంచి రక్షించడమే కాదు, పప్పులను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు. మీరు వాటిని గాలి చొరబడని కంటైనర్‌లలో లేదా జిప్‌లాక్ ప్యాకెట్లలో నిల్వ చేయవచ్చు..
ఒకవేళ పప్పుకు పురుగు పట్టినట్లు గుర్తిస్తే.. దాన్ని క్లాత్‌పై వేసి కనీసం రెండు మూడు రోజులు ఎండలో ఉంచండి. చీకటి, చల్లగా ఉన్న ప్రదేశాలలో పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, పప్పులను ఎండలో ఉంచితే అవి పారిపోతాయి.. అప్పుడప్పుడు ఎండలో ఉంచితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి..
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!