Rajasthan: ఇదేం మూఢనమ్మకం.. కొడుకు ఆరోగ్యం కోసం కూతురును బలి ఇచ్చిన తల్లి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: సాంకేతికత విపరీతంగా పెరిగిన ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలతో కొందరు మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ మూర్ఖత్వం ఎంతలా అంటే సొంత కూతురినే చంపుకునేంత. అవునండీ.. మూఢనమ్మకంతో ఓ తల్లి కొడుకు కోసం కూతురినే చంపుకుంది. రాజస్థాన్‌లో ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తల్లే మూఢనమ్మకాలను నమ్మి తన 12 ఏళ్ల కూతురిని గొంతుకోసి హత్య చేసింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన 16 ఏళ్ల కొడుకు కోసం ఎవరినైనా బలి ఇస్తే ఆరోగ్యంగా ఉంటాడని భావించిన ఆ తల్లి ఈ దారుణానికి ఒడిగట్టింది. అందుకోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో ఆ కర్కశ తల్లి తెలిపింది.
Fight in Wedding: వివాహ వేడుకలో తలెత్తిన గొడవ.. నలుగురు మృతి
Also Read
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
రాజస్థాన్‌లోని బారాన్ జిల్లాలో గల అంట ప్రాంతంలో రేఖ హదా అనే ఓ మహిళ తన కుమారుడు నికేంద్ర సింగ్‌ను ఎంతో ప్రేమగా చూసుకునేది. అతడికి గుండెలో రంధ్రం ఉండడంతో పాటు మానసిక స్థితి కూడా బాగుండేది కాదు. అతడి ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతున్న ఆమె ఎవరినైనా బలి ఇస్తే కొడుకు ఆరోగ్యంగా ఉంటాడని భావించి ఈ దారుణానికి పాల్పడింది. ఈ మేరకు డీఎస్పీ తరుణ్ కాంత్ సోమాని వెల్లడించారు. తన కొడుకు ఆరోగ్యంగా ఉంటాడనే నమ్మకంతో ఆ మహిళ కూతురు సంజనను గొంతుకోసి హత్య చేసిందని పోలీసులు పేర్కొన్నారు. మొదట చిన్న కొడుకుపై దాడి చేయగా అతను తప్పించుకున్నాడని.. అనంతరం సంజనను హత్య చేసిందని వారు తెలిపారు. భర్తపైనా కూడా ఇలానే దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది.
తాజావార్తలు
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
-
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!