NTV Telugu Site icon

Rajasthan: ఇదేం మూఢనమ్మకం.. కొడుకు ఆరోగ్యం కోసం కూతురును బలి ఇచ్చిన తల్లి!

Rajasthan

Rajasthan

Rajasthan: సాంకేతికత విపరీతంగా పెరిగిన ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలతో కొందరు మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ మూర్ఖత్వం ఎంతలా అంటే సొంత కూతురినే చంపుకునేంత. అవునండీ.. మూఢనమ్మకంతో ఓ తల్లి కొడుకు కోసం కూతురినే చంపుకుంది. రాజస్థాన్‌లో ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తల్లే మూఢనమ్మకాలను నమ్మి తన 12 ఏళ్ల కూతురిని గొంతుకోసి హత్య చేసింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన 16 ఏళ్ల కొడుకు కోసం ఎవరినైనా బలి ఇస్తే ఆరోగ్యంగా ఉంటాడని భావించిన ఆ తల్లి ఈ దారుణానికి ఒడిగట్టింది. అందుకోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో ఆ కర్కశ తల్లి తెలిపింది.

Fight in Wedding: వివాహ వేడుకలో తలెత్తిన గొడవ.. నలుగురు మృతి

రాజస్థాన్‌లోని బారాన్‌ జిల్లాలో గల అంట ప్రాంతంలో రేఖ హదా అనే ఓ మహిళ తన కుమారుడు నికేంద్ర సింగ్‌ను ఎంతో ప్రేమగా చూసుకునేది. అతడికి గుండెలో రంధ్రం ఉండడంతో పాటు మానసిక స్థితి కూడా బాగుండేది కాదు. అతడి ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతున్న ఆమె ఎవరినైనా బలి ఇస్తే కొడుకు ఆరోగ్యంగా ఉంటాడని భావించి ఈ దారుణానికి పాల్పడింది. ఈ మేరకు డీఎస్పీ తరుణ్‌ కాంత్‌ సోమాని వెల్లడించారు. తన కొడుకు ఆరోగ్యంగా ఉంటాడనే నమ్మకంతో ఆ మహిళ కూతురు సంజనను గొంతుకోసి హత్య చేసిందని పోలీసులు పేర్కొన్నారు. మొదట చిన్న కొడుకుపై దాడి చేయగా అతను తప్పించుకున్నాడని.. అనంతరం సంజనను హత్య చేసిందని వారు తెలిపారు. భర్తపైనా కూడా ఇలానే దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది.