NTV Telugu Site icon

Naked Woman Driving : బట్టల్లేకుండా స్కూటీ నడిపింది.. అడ్డంగా బుక్కైంది

Woman Naked Brazile

Woman Naked Brazile

Naked Woman Driving : సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది వైరల్ కావడానికి నానాపాట్లు పడుతున్నారు. కొన్ని సార్లు పిచ్చిపిచ్చి పనులు చేస్తూ వైరల్ అవుతున్నారు. వారు చేసే చేష్టలు ఎలా ఉన్నా సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది విభిన్న రీతిలో బైక్ లేదా కారు నడిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ పరిమితి దాటిపోయింది. ఈ మహిళ బట్టలు లేకుండా స్కూటీను రోడ్డు మీద నడిపించింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకోగా.. మహిళ కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. చివరికి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: Current Bill : విద్యుత్ వినియోగదారులకు షాక్.. నాలుగు నెలలపాటు చార్జీల భారం

ఈ సంఘటన బ్రెజిల్‌లోని ఆగ్నేయ రాష్ట్రమైన ఎస్పిరిటో శాంటోకి చెందినది. డైలీ స్టార్‌లోని కథనం ప్రకారం, రాజధాని విలా వెల్హా నుండి విటోరియాకు వెళ్లే రహదారిపై ఈ సంఘటన జరిగింది. మహిళ తన స్కూటీతో నగ్నంగా వెళ్తున్నప్పుడు ఏం చేయాలో ఏమి అర్థం కాలేదు. ఆ తర్వాత కొందరు అలా మహిళను చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తమ కారులో మహిళను వెంబడించి అడ్డుకున్నారు. పోలీసులు మహిళను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, మహిళ పోలీసులను తోసేసి పారిపోయింది. మళ్లీ ఆమెను చేజ్ చేసి పట్టుకున్నారు. వెంటనే మహిళ చేత దుస్తులను ధరింపచేయించారు. అసలు ఆ మహిళ అలా చేయడానికి కారణం ఏమై ఉంటుందో అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మానసిక పరిస్థితిపై కూడా విచారణ చేస్తున్నారు. మహిళ ఎందుకు ఇలా చేసిందనేది నిర్ధారణ కాలేదని చెబుతున్నారు. ఆమె ఏదో ఒక ప్రదర్శనలో లేదా నిరసనలో పాల్గొనబోతోందా? దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదు.

Read Also: Teddy Love : విచిత్రమైన ప్రేమకథ.. భర్త పోయాక పదేళ్లుగా అన్నీ టెడ్డీ బేర్‌తోనే..