NTV Telugu Site icon

Woman on Car Bonnet: పట్టపగలే దారుణం.. కారు బానెట్‌పై యువతిని అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌! వీడియో వైరల్

Woman On Car Bonnet

Woman On Car Bonnet

Rajasthan Woman dragged on Car Bonnet for 500 Metres: రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌ జిల్లాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని కారు బానెట్‌పై దాదాపుగా అర కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లాడు ఓ వ్యక్తి. చుట్టుపక్కల వారు ఆపమంటూ కారు వెంట పరుగులు తీసినా.. డ్రైవర్ మాత్రం ఆపకుండా దుసుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో ప్రకారం… హనుమాన్‌నగర్‌ ప్రధాన బస్టాండ్‌ సమీపంలోని జంక్షన్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ కారు రాంగ్‌ సైడ్‌లో వచ్చింది. ఆ కారుకు ఓ యువతి అడ్డం వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. కారు యువతి పైకి వెళ్లగా.. ఆమె చాకచక్యంగా బానెట్‌ను గట్టిగా పట్టుకుంది. అయితే డ్రైవర్‌ కారును ఆపకుండా.. అలాగే ముందుకు పోనిచ్చాడు. ట్రాఫిక్ ఉన్నా కూడా రాంగ్‌ సైడ్‌లోనే కారును నడిపాడు. ఇది చూసిన స్థానికులు ఆపమంటూ కారు వెంట పరుగులు తీసినా.. డ్రైవరు ఆపలేదు.

Also Read: Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు!

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోను రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘గెహ్లాట్ జీ.. మీ దుష్ట పాలనలో రాజస్థాన్‌లో మహిళలకు ఏం జరిగిందో చూశారా?’ అని పేర్కొన్నారు. ఈ ఘనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ విజువల్స్‌ ఆధారంగా కారు రావ్లా నివాసి పేరుతో రిజిస్టర్ అయినట్లు తెలిసిందని జంక్షన్‌ స్టేషన్‌ ఇంఛార్జ్‌ విష్ణు ఖత్రి తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టినప్పటికీ.. బాధితురాలి నుంచి ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.

Show comments