Woman on Car Bonnet: పట్టపగలే దారుణం.. కారు బానెట్‌పై యువతిని అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డ్రైవర్! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Woman dragged on Car Bonnet for 500 Metres: రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని కారు బానెట్‌పై దాదాపుగా అర కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లాడు ఓ వ్యక్తి. చుట్టుపక్కల వారు ఆపమంటూ కారు వెంట పరుగులు తీసినా.. డ్రైవర్ మాత్రం ఆపకుండా దుసుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో ప్రకారం… హనుమాన్‌నగర్ ప్రధాన బస్టాండ్ సమీపంలోని జంక్షన్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ కారు రాంగ్ సైడ్‌లో వచ్చింది. ఆ కారుకు ఓ యువతి అడ్డం వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. కారు యువతి పైకి వెళ్లగా.. ఆమె చాకచక్యంగా బానెట్‌ను గట్టిగా పట్టుకుంది. అయితే డ్రైవర్ కారును ఆపకుండా.. అలాగే ముందుకు పోనిచ్చాడు. ట్రాఫిక్ ఉన్నా కూడా రాంగ్ సైడ్‌లోనే కారును నడిపాడు. ఇది చూసిన స్థానికులు ఆపమంటూ కారు వెంట పరుగులు తీసినా.. డ్రైవరు ఆపలేదు.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
Also Read: Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు!
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘గెహ్లాట్ జీ.. మీ దుష్ట పాలనలో రాజస్థాన్‌లో మహిళలకు ఏం జరిగిందో చూశారా?’ అని పేర్కొన్నారు. ఈ ఘనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా కారు రావ్లా నివాసి పేరుతో రిజిస్టర్ అయినట్లు తెలిసిందని జంక్షన్ స్టేషన్ ఇంఛార్జ్ విష్ణు ఖత్రి తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టినప్పటికీ.. బాధితురాలి నుంచి ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
सत्ता के संरक्षण में बदमाशों ने थामी अपराध की स्टेयरिंग !
राजस्थान के हनुमानगढ़ में दिनदहाड़े बदमाश कार के बोनट पर एक महिला को घसीट रहे हैं। गहलोत जी, रोज़ाना सरेआम जब ऐसी वारदात महिलाओं के साथ हो रही हैं तो क्या आपको अंदाज़ा भी है कि पूरे राजस्थान में आपके कुशासन में महिलाओं का… pic.twitter.com/ZvoyTRPuiI
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) August 16, 2023
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!