NTV Telugu Site icon

Worlds Longest Food Delivery : 30వేల కిలోమీటర్లు ప్రయాణించి ఫుడ్ డెలివరీ చేసిన మహిళ

Wimen

Wimen

Worlds Longest Food Delivery : సింగపూర్‌కు చెందిన ఓ మహిళ ప్రపంచంలోనే లాంగెస్ట్ ఫుడ్ డెలివరీ చేశారు. అంటార్కిటికాలోని తన కస్టమర్‌కు ఆహారాన్ని డెలివరీ చేసేందుకు నాలుగు ఖండాలు దాటింది. ఇందుకోసం ఆమె 30వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ క్రమంలో నాలుగు ఖండాలను దాటుకుని తన ప్రయాణం కొనసాగించింది. ఈ జర్నీకి సంబంధించిన జర్నీని మానసా గోపాల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్టు చేశారు.

Read Also: Viral Video: మంచికి రోజుల్లేవంటే ఇదేనేమో.. చివరికి కన్ను పోయిందిగా..

వీడియోలో, ఒక ఆహార ప్యాకెట్‌ను పట్టుకుని 30,000 కి.మీ తన ప్రయాణంలో ప్రధాన మజిలీలను పేర్కొన్నారు. ఆమె తన ప్రయాణాన్ని సింగపూర్ నుండి ప్రారంభించి హాంబర్గ్‌కు వెళ్లింది.. తర్వాత బ్యూనస్ ఏర్స్ అటునుంచి ఉషుయా, ఆపై అంటార్కిటికా చేరుకుంది. ఈ ప్రయాణంలో ఆమె మంచుదారులు, మురికి నీటి తోవలు చూపించారు. చివరకు ఆమె తన కస్టమర్‌కు ఫుడ్ డెలివరీ చేశారు.

Read Also: Gaza Birthday incident : బర్త్ డే వేడుకలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 17మంది సజీవదహనం

తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఇలా రాసుకొచ్చారు. ‘ఈ రోజు తాను సింగపూర్ నుంచి అంటార్కిటికాకు ప్రత్యేకంగా ఫుడ్ డెలివరీ చేశాను. ఇది సాధ్యం కావడానికి ఫుడ్ పాండాకు చెందిన అద్భుతమైన సిబ్బందితో భాగస్వామ్యం పంచుకున్నాను’ అని వివరించారు. తన అంటార్కిటికా టూర్ కోసం 2021లో ఫండ్స్ రైజ్ చేయడానికి ప్రయత్నించానని ఆమె మరో పోస్టులో వివరించారు. ఇందుకోసం తనకు ఒక బ్రాండ్ స్పాన్సర్ సహకారం అవసరం పడిందని తెలిపారు. ఒక నెల క్రితమే తనకు ఫుడ్ పాండా నుంచి రిప్లై వచ్చిందని, తన కలను సుసాధ్యం చేయడానికి ఈ బ్రాండ్ అంగీకరించిందని వివరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా. చాలా మంది అద్భుతమంటూ కామెంట్ చేశారు.