Site icon NTV Telugu

Zepto Order: జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన మహిళ.. రూ. 24 రిఫండ్ కోసం ప్రయత్నిస్తే రూ.87,000 పోయినయ్

Zepto

Zepto

ఆన్ లైన్ మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సైబర్ క్రిమినల్స్ సరికొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ రూ. 24 రిఫండ్ కోసం ప్రయత్ని్స్తూ రూ. 87 వేలు పోగొట్టుకుంది. అహ్మదాబాద్‌లో షాకింగ్ ఆన్‌లైన్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. చంద్‌ఖేడా ప్రాంతంలో నివసించే ఆ మహిళ జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసింది. కానీ చిన్న వాటికి బదులుగా పెద్ద వంకాయలు రావడంతో ఆమె వాటిని తిరిగి పంపడానికి ప్రయత్నించింది.

Also Read:Smriti Mandhana: ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్..

అయితే డెలివరీ బాయ్ డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరించి, తన దగ్గర నంబర్ లేదని చెప్పి కస్టమర్ కేర్ కు కాల్ చేయమని ఆమెకు సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఆ మహిళ ఆన్‌లైన్‌లో కస్టమర్ కేర్ నంబర్‌ను వెతికి, ఓ వ్యక్తితో మాట్లాడగా మరొక నంబర్‌ ఇచ్చాడు. ఆ నంబర్‌కు కాల్ చేయగానే, ఆమెను వాట్సాప్ కు CUSTOMERSUPPORT.APK అనే ఫైల్‌ను పంపారు.

Also Read:Goa Fire Accident : నైట్‌ క్లబ్‌లో అగ్ని ప్రమాదంపై సీఎం ప్రమోద్‌ సావంత్‌ సీరియస్ !

ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఆ మహిళను ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను అడిగారు, ఆ తర్వాత ఆమె మూడు బ్యాంక్ ఖాతాల నుండి మొత్తం 87,000 రూపాయలు విత్‌డ్రా చేసుకున్నారు సైబర్ మోసగాళ్లు. బ్యాంకు నుంచి మెసేజ్ అందిన వెంటనే, ఆ మహిళ మోసపోయానని గ్రహించి 1930 హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేసి, ఆపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.

Exit mobile version