Viral Video: ఆడవారు సాధారణంగా మానసికంగా బలంగా ఉంటారు కానీ శారీరకంగా మాత్రం పురుషులతో పోల్చుకుంటే బలహీనంగా ఉంటారు. ఆడవారు మహా అయితే ఒక 50 లేదా60 కేజీల వరకు మోయగలరు. ఒక వేళ జిమ్ కు వెళ్లే వారైతే 100 కేజీల వరకు ఎత్తగలుగుతారు. ఇక వెయిట్ లిఫ్టింగ్ చేసే ఆడవాళ్లు అయితే 150 నుంచి 200 కిలోల వరకు బరువు మోయగలుగుతారు. అయితే ఇక్కడ ఓ మహిళ మాత్రం రెండు బరువైన చెక్క దుంగలను అవలీలగా వీపుపై పెట్టుకొని మోసేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె స్నేహితులు వీడియో తీసి పోస్ట్ తీయడంతో ఈ షీ హల్క్ గురించి తెలిసింది.
Also Read: Lemon Water: నిద్ర లేవగానే నిమ్మ నీరు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి.
ఇక వీడియో విషయానికి వస్తే దీనిని ఫన్నీ ఎక్స్ పోస్ట్ అనే ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో చాలా సన్నగా కనిపిస్తున్న ఓ యువతి మొదట ఒక బలమైన పెద్ద దుంగను చేతిలోపట్టుకొని ఉంటుంది. దానిని సరిగా నిలబెట్టిన తరువాత మరో చేతితో ఇంకో దుంగను పట్టుకొని కొద్దిగా కాలు సాయం తీసుకొని దానిని కూడా పైకి తీసుకుంటుంది. ఇక ఇప్పుుడు ఆ రెండింటి కలిపి ఓ తాడుతో కడుతుంది. అనంతరం వాటిని భుజాన వేసుకొని తీసుకువెళుతుంది. ఆ దుంగలే బరువుగా ఉన్నాయి అనుకుంటే అవి అప్పటికే నీటిలో తడిచి ఉన్నాయి. అంటే వాటి బరువు ఉండవలసిన దాని కన్నా ఎక్కువగానే ఉంటుంది. అంత బరువును కూడా ఆ మహిళ సునాయాసంగా ఎత్తేసి భుజాన వేసి నడుచుకుంటూ వెళుతుంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఆమె షీ హల్క్ తో, బాహుబలితో పోలుస్తున్నారు. అడవి తల్లిపై ఆధారపడి బతికే వారి భుజాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమెను సూపర్ ఉమెన్ అంటూ పొగిడేస్తున్నారు. బలంలో కూడా అమ్మాయిలు, అబ్బాయిలకు ఏమాత్రం తక్కువ కాదు కేవలం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు నెటిజన్లు. అన్ బిలివబుల్ అంటూ క్యాప్షన్ జోడించి పోస్ట్ చేసిన ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.
Unbelievable 💪 pic.twitter.com/rNHFIPvojP
— Funny 𝕏 Post (@FunnyXPost) August 27, 2023