Woman Killed By Dogs: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై వీధికుక్కులు దాడి చేసి ప్రాణాలు తీశాయి. అనంతరం మృతదేహాన్ని పీక్కుతిన్నాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలోని ముండ్రాయి గ్రామంలో 55 ఏళ్ల మహిళపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. జిల్లా కేంద్రానికి 20 కి.మీ. దూరంలోని కన్హివాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో కుక్కకాటు కారణంగానే మహిళ మృతి చెందిందని ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు తెలిపారు. కుక్కల దాడిలో ఆమె శరీరంలో బలమైన, లోతైన గాయాలు అయినట్లు తేలింది. మృతదేహంపై ఇతర గాయాల గుర్తులు కనిపించలేదని కన్హిల్వాడ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ మోనిస్ సింగ్ బైస్ తెలిపారు.
Read Also: Prabhas: ఈ కాంబినేషన్ రెడ్ అలర్ట్ ని ప్రకటించేలా ఉంది…
ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు స్పష్టమవుతాయని చెప్పారు. బాధితురాలి బంధువు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 7 గంటల సమయంలో మహిళ పొలానికి వెళ్తుండగా ఓ చెట్టు చుట్టూ వీధి కుక్కల గుంపు చేరింది. అనంతరం కొందరు అటుగా వెళ్తున్నవారు శవాన్ని తింటున్న కుక్కలను గమనించి గ్రామస్థులకు, కన్హివాడ పోలీసులకు సమాచారం అందించారు. మహిళపై జరిగిన హింసాత్మక దాడి గురించి అటవీ అధికారులకు కూడా సమాచారం అందించారు. మహిళ మాంసాన్ని తిన్న తీరు చూస్తుంటే అడవి జంతువుల దాడిగా కనిపించడం లేదని సియోనీ సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి యోగేష్ పటేల్ తెలిపారు. ఘటనా స్థలానికి 5 కిలోమీటర్ల పరిధిలో అడవి లేదని తెలిపారు.
Read Also: Gun Fire : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి