NTV Telugu Site icon

Romantic Fight: రొమాన్స్ విషయంలో గొడవ.. బావిలో దూకిన భార్య.. ఆ తర్వాత ఏమైందంటే?

Romantic Fight

Romantic Fight

Romantic Fight: భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమే. కానీ మద్యం సేవించడం వల్ల ఈ గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయంటే నమ్మక తప్పదు. ఆల్కహాల్ సేవనం తర్వాత ఇంటికొచ్చి కుటుంబీకులతో గొడవ పడిన ఘటనల గురించి వార్తల్లో చూస్తునే ఉన్నాం. ఇలాంటి ఘటనల్లో కొన్నిసార్లు వ్యక్తిగత దాడుల వరకు వెళ్లాయి. అలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరిగింది. శారీరక సాన్నిహిత్యం విషయంలో భర్తతో గొడవపడి ఓ మహిళ బావిలో దూకింది. ఆమెను కాపాడేందుకు భర్త బావిలోకి దూకాడు. బావిలో దూకిన భార్యను కాపాడాడు. కానీ కాపాడిన కొన్ని క్షణాల తర్వాత మళ్లీ ఆ భర్తే చంపేశాడు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

శంకర్‌రామ్, అతని భార్య ఆశాబాయి ఇద్దరూ సోమవారం రాత్రి మద్యం సేవించి పడుకున్నారు. దీంతో శంకర్ తనతో శృంగారంలో పాల్గొనాలని భార్యను కోరాడు. శంకర్‌తో శృంగారానికి ఆశా నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శారీరక సాన్నిహిత్యానికి సంబంధించిన గొడవ ఎంతగా పెరిగిపోయిందంటే, ఆశా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్యను కాపాడేందుకు శంకర్ కూడా బావిలోకి దూకాడు. కాసేపటి తర్వాత ఆశాను కాపాడి బావిలో నుంచి బయటకు తీశాడు.

Read Also: Physical Harassment: బాలుడిపై అత్యాచార యత్నం.. హతమార్చిన మైనర్

శంకర్ ఆశను రక్షించి బావిలో నుంచి బయటకు తీయడంతో మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశానికి లోనైన శంకర్ ఆశా ప్రైవేట్ భాగాలపై దాడి చేసి హత్య చేశాడు. ఆమెను హత్య చేసిన తర్వాత రాత్రంతా భార్య మృతదేహం దగ్గరే కూర్చున్నాడు. ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు స్టేషన్‌ ఇన్‌చార్జి గార్డెన్‌ జగ్సే పంక్రా తెలిపారు.

Show comments