NTV Telugu Site icon

Thailand: గబ్బిలాల సూప్ వండుకొని తాగింది.. చివరకు జైలు పాలైంది..

Bat Soup

Bat Soup

Woman In Thailand Arrested After Filming Herself Having Bat Soup: థాయ్‌లాండ్‌లో ఓ మహిళ గబ్బిలాల సూప్ వండుకొని తాగింది. ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేసింది. ఇది చూసిన అక్కడి అధికారులు సదరు మహిళను జైలులో వెేశారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం నాడు ఫోంచనోక్ శ్రీసునక్లువా అనే యువతి తన యూట్యూబ్ ఛానెల్ లో గబ్బిలాలను వండుకుని తిన్న వీడియోను పోస్ట్ చేసింది. ‘‘జిప్ జాప్ బెన్ సువా( స్పైసీ రుచికరంగా తినండి)’’ అంటూ క్యాప్షన్ పెట్టి ఈ వీడియో అప్ లోడ్ చేసింది. ఈ వీడియోలో చనిపోయిన గబ్బిలాలను టామోటాలు ఇతర ఆహార పదార్థాలతో ఉడికించి..నిమ్ జామ్ అనే సాస్ లో గబ్బిలాల మాంసాన్ని ముంచడాన్ని చిత్రీకరించింది. తన వీడియోలో మాట్లాడుతూ.. గబ్బిలాన్ని తినడం మొదటిసారి అని పేర్కొంది.

Read Also: Tata Motors: టాటా నుంచి తొలి సీఎన్‌జీ కార్.. టియాగో ఎన్‌ఆర్‌జి సీఎన్‌జీ టీజర్ రిలీజ్.. ఫీచర్లు ఇవే..

ఈ గబ్బిలాలను ఉత్తర థాయ్‌లాండ్‌లోని లావోస్ సరిహద్దు సమీపంలోని మార్కెట్ నుంచి కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ వీడియోపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. కొందరు దీన్ని అసహ్యకరమైనదిగా కామెంట్ చేశారు. మరొకరు కరోనా గురించి కామెంట్ చేశారు. మీరు చనిపోతే చనిపోండి కానీ.. ఒక మహమ్మారిని ప్రారంభించేందుకు కారణం అవుతారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీంతో శ్రీసునక్లువా ఈ వీడియోను తొలగించింది. అయితే రక్షిణ వన్యప్రాణుల కళేబరాలను కలిగి ఉన్నందుకు, ఆ వీడియోను అప్ లోడ్ చేసినందుకు 2007 కంప్యూటర్ చట్టాల ప్రకారం థాయ్‌లాండ్‌ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది. దోషిగా తేలితే సదరు యువతికి 5 ఏళ్ల జైలు శిక్ష లేదా రూ.11.21 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.

అయితే కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి దీనికి కారణం గబ్బిలాలే అని చాలా మంది వాదిస్తున్నారు. అయితే ఇది ఏ పరిశోధనలో తేలనప్పటికీ.. గబ్బిలాలు చాలా వైరస్ లకు కేంద్రంగా ఉంటాయి. గతంలో చాలా మహమ్మారిలకు గబ్బిలాలే కారణం అయ్యాయి. ముఖ్యంగా ప్రాణాంతక నిఫా వైరస్ కు గబ్బిలాలే కారణం అవుతాయి. చైనాలో చాలా మంది గబ్బిలాల మాంసాన్ని తినడంతో పాటు దాన్ని సూపుగా తాగుతారు. తాజాగా కోవిడ్-19 దృష్ట్యా అక్కడి ప్రజలు ఆ యువతి చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Show comments