Preganent Women: ఓ మహిళ ఏడునెలల క్రితం బైకుపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతో కోమాలోకి వెళ్లింది. వైద్యులు పలుమార్లు ఆమెకు శస్త్ర చికిత్సలు నిర్వహించినా ఫలితం లేదు. యాక్సిడెంట్ జరిగేనాటికి ఆమె రెండు నెలల గర్భంతో ఉంది. అప్పటి నుంచి ఆమె కోమాలోనే ఉంది.. గత వారం ఆమె ఎయిమ్స్‌లో ఆరోగ్యవంతమైన ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
Read Also: Imran khan: భారత్ పై పొగడ్తలు గుప్పించిన పాక్ మాజీ ప్రధాని
ఢిల్లీలోని బులంద్ షెహర్‌కు చెందిన 23 ఏళ్ల మహిళ ఈ ఏడాది మార్చి 31న తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు యాక్సిడెంట్ కు గురైంది. ఆ రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వైద్యులు పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినా ఆమె గత ఏడు నెలలుగా అపస్మారక స్థితిలోనే ఉంది. ప్రమాదం జరిగేనాటికి రెండు నెలల గర్భంతో ఉన్న ఆమె గత వారం ఎయిమ్స్‌లో ఆరోగ్యవంతమైన ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె భర్త ప్రైవేట్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గర్భవతి అయిన తన భార్య స్పృహలో లేకపోవడంతో ఆమె బాగోగులు చూసుకునేందుకు ఉద్యోగం మానేశాడు. ఎయిమ్స్‌కి వచ్చినప్పుడు ఆ మహిళ 40 రోజుల గర్భవతి.
Read Also: Colour Change Dress: ఎండకు రంగులు మారే వెరైటీ డ్రెస్
ఆమె పరిస్థితిని గైనకాలజిస్ట్‌ల బృందం సమీక్షించి, శిశువు ఆరోగ్యంగా ఉందని, బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. దీంతో ఆమె భర్త బిడ్డను దక్కించుకోవాలనుకున్నాడు. దీంతో గత వారం ఆమెకు గైనకాలజీ బృందం సాధారణ ప్రసవం చేసింది. ఆడబిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉంది. కాగా, రోడ్డు ప్రమాదానికి గురైన 23 ఏళ్ల మహిళ తలకు ఇప్పటివరకు 5 సర్జరీలు చేసినట్టు వైద్యులు తెలిపారు. ఆమె కళ్ళు తెరుస్తుంది. దేనికీ స్పందంచడం లేదు. ఏ ఆదేశాలను పాటించదని న్యూరోసర్జరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ తెలిపారు.