NTV Telugu Site icon

Madhya Pradesh: ఉజ్జయినిలో దారుణం.. మహిళపై గ్యాంగ్‌రేప్

Rjeke

Rjeke

దేశంలో రోజు రోజుకు మహిళలపై దారుణాలు.. ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట నారీమణులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ లాంటి కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. ఏపీలో తాజాగా బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం చేసి చంపేసిన ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Mumbai: అటల్ సేతు బ్రిడ్జిపై పగుళ్లు.. అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపణ

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని ఓ గ్రామంలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడానికి 1.5 కిలోమీటర్లు అర్ధనగ్నంగా పరిగెత్తిందని పోలీసులు తెలిపారు. యువతి గ్రామస్తులకు జరిగిన ఘోరాన్ని వివరించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పారిపోతుండగా నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Postoffice Jobs : పది పాసైన వారికి గుడ్ న్యూస్..పోస్టల్‌ శాఖలో భారీగా ఉద్యోగాలు..