NTV Telugu Site icon

Rajasthan: సామూహిక అత్యాచారం నగ్నంగా పరుగులు తీసిన మహిళ

Rape

Rape

Gang Rape On Woman: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారిపై ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలయడం లేదు. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఎంత మంది పోలీసులు పహారా కాస్తున్న ఏదో ఓ మూల ఆడ పిల్ల అత్యాచారానికి గురవుతూనే ఉంది. కొన్ని సార్లు అందరూ ఉన్నా పట్టపగలు నడిరోడ్డుపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా వారిని అంతమొందిస్తున్నారు కూడా. తాజాగా వాకింగ్ చేస్తున్న మహిళను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేయడంతో ఆమె నగ్నంగా పరుగులు తీసింది. ఈ అమానవీయ ఘటన రాజస్తాన్ లో చోటు చేసుకుంది. అనంతరం నిందితులను పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

Also Read: Gold Price Today: గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

వివరాల ప్రకారం రాజస్తాన్ లోని బిల్వారా ప్రాంతంలో ఉంటున్న మహళకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనను కలవాలని ఆ వ్యక్తి ఆమెను కోరాడు. అయితే అందుకు ఆ మహిళ నిరాకరించింది. సాయంత్రం ఎప్పటి లాగానే ఆ మహిళ ఏడు గంటల ప్రాంతంలో వాకింగ్ కు వెళ్లింది. మొదటి నుంచి ఆమెను ఫాలో అవుతున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను లాకెళ్లి సామూహిక అత్యాచారానిక పాల్పడ్డారు. అయితే వారి దగ్గర నుంచి తప్పించుకున్న మహిళ నగ్నంగానే రోడ్డుపై పరుగులు పెట్టింది. అలా పరిగెత్తుకుంటూ  ఆమె పక్కనే ఉన్న గ్రామాన్ని చేరుకుంది. ఆ గ్రామస్థులు ఆ మహిళకు బట్టలు ఇచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలి వద్ద జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆమెను రేప్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఓ ద్విచక్రవాహనాన్ని, పగిలిన ఆమె చేతి గాజు ముక్కలను పోలీసులు  గుర్తించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  నిందుతులను చోటు, గిరిధర్ లుగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

Show comments