NTV Telugu Site icon

Woman Drink Blood : అబ్బా ఎంత ఘోరం… బాలుడిని చంపి రక్తం తాగి.. ముఖానికి పూసుకుని

Crime

Crime

Woman Drink Blood : ఉత్తర ప్రదేశ్లో ఘోరం జరిగింది… మాంత్రికుడి మాటలు నమ్మి పదేళ్ల చిన్నారిని ఓ మహిళ దారుణంగా చంపింది. అనంతరం బాలుడి రక్తాన్ని తాగి, ముఖానికి పూసుకుంది. చదువుతుంటేనే ఒళ్లు జలదరిస్తుంది కదూ.. కాకపోతే ఇది చాలా కాలం క్రితమే జరిగింది. తాజాగా ఈ కేసులో దోషిగా తేలిన ఆ మహిళకు ఉత్తర్ ప్రదేశ్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. క్షుద్రపూజల పేరుతో ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి ఆమె ఈ దారుణానికి ఒడికట్టింది. షాజహాన్‌పూర్ జిల్లా రోజా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జముకా గ్రామానికి చెందిన ధన్‌దేవికి పెళ్లయి ఆరేళ్లయినా సంతానంలేదు. పిల్లల కావాలని అనేక పూజలు చేసినా ఫలితం లేకపోవడంతో ఓ మాంత్రికుడిని ఆశ్రయించింది.

Read Also: Gujarat Elections: గుజరాత్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం.. డైమండ్ సిటీలో నేడు ప్రధాని మోడీ, కేజ్రీవాల్

ఈ నేపథ్యంలో అతడు చెప్పినట్టు పదేళ్ల బాలుడిని చంపి రక్తం తాగింది. దీనిపై ఐదేళ్ల కిందట జరిగిన ఘటనపై బరేలీ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. 2017 డిసెంబరు 5న తన పొరుగింట్లో ఉండే లాల్‌దాస్‌ అనే పదేళ్ల చిన్నారిని మరో ఇద్దరితో కలిసి కిడ్నాప్ చేసింది. అనంతరం క్షుద్రపూజలు చేసి బాలుడి గొంతు కోసి చంపేసింది. దీనికి ముందు బాలుడి చెంప కోసి రక్తాన్ని తాగింది.. తర్వాత శవాన్ని ఇంటి ముందు పడేసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. హత్య కేసులో ధన్‌దేవీతో పాటు ఆమెకు సహకరించిన ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణ పూర్తిచేసిన బరేలీ జిల్లా కోర్టు.. దోషులకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, రూ.5 వేలు జరిమానా విధించింది. పిల్లల లేకపోవడంతో ఓ మాంత్రికుడు చెప్పినట్లు తాను చేశానని విచారణలో ఒప్పుకుంది. కాగా, కోర్టు తీర్పుపై బాలుడి తండ్రి ఓం ప్రకాశ్ స్పందిస్తూ.. ఈ శిక్ష సరిపోదని అన్నారు. వారికి మరణశిక్ష విధించి ఉండాల్సిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

Show comments