Woman Drink Blood : అబ్బా ఎంత ఘోరం… బాలుడిని చంపి రక్తం తాగి.. ముఖానికి పూసుకుని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Drink Blood : ఉత్తర ప్రదేశ్‌లో ఘోరం జరిగింది… మాంత్రికుడి మాటలు నమ్మి పదేళ్ల చిన్నారిని ఓ మహిళ దారుణంగా చంపింది. అనంతరం బాలుడి రక్తాన్ని తాగి, ముఖానికి పూసుకుంది. చదువుతుంటేనే ఒళ్లు జలదరిస్తుంది కదూ.. కాకపోతే ఇది చాలా కాలం క్రితమే జరిగింది. తాజాగా ఈ కేసులో దోషిగా తేలిన ఆ మహిళకు ఉత్తర్ ప్రదేశ్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. క్షుద్రపూజల పేరుతో ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి ఆమె ఈ దారుణానికి ఒడికట్టింది. షాజహాన్‌పూర్ జిల్లా రోజా పోలీస్‌స్టేషన్ పరిధిలోని జముకా గ్రామానికి చెందిన ధన్‌దేవికి పెళ్లయి ఆరేళ్లయినా సంతానంలేదు. పిల్లల కావాలని అనేక పూజలు చేసినా ఫలితం లేకపోవడంతో ఓ మాంత్రికుడిని ఆశ్రయించింది.
Also Read
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?
ఈ నేపథ్యంలో అతడు చెప్పినట్టు పదేళ్ల బాలుడిని చంపి రక్తం తాగింది. దీనిపై ఐదేళ్ల కిందట జరిగిన ఘటనపై బరేలీ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. 2017 డిసెంబరు 5న తన పొరుగింట్లో ఉండే లాల్దాస్ అనే పదేళ్ల చిన్నారిని మరో ఇద్దరితో కలిసి కిడ్నాప్ చేసింది. అనంతరం క్షుద్రపూజలు చేసి బాలుడి గొంతు కోసి చంపేసింది. దీనికి ముందు బాలుడి చెంప కోసి రక్తాన్ని తాగింది.. తర్వాత శవాన్ని ఇంటి ముందు పడేసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. హత్య కేసులో ధన్‌దేవీతో పాటు ఆమెకు సహకరించిన ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ పూర్తిచేసిన బరేలీ జిల్లా కోర్టు.. దోషులకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, రూ.5 వేలు జరిమానా విధించింది. పిల్లల లేకపోవడంతో ఓ మాంత్రికుడు చెప్పినట్లు తాను చేశానని విచారణలో ఒప్పుకుంది. కాగా, కోర్టు తీర్పుపై బాలుడి తండ్రి ఓం ప్రకాశ్ స్పందిస్తూ.. ఈ శిక్ష సరిపోదని అన్నారు. వారికి మరణశిక్ష విధించి ఉండాల్సిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
తాజావార్తలు
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
-
Devji : లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ..
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
-
Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
-
Malayalam: మలయాళం అంటే చిన్నచూపా?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!