Tirumala: తిరుమలలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో గుండెపోటుతో మహిళ మృతి చెందింది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో ఈ ఘటన జరిగింది. సర్వదర్శనం క్యూలైన్‌లో వెళ్తుండగా.. కడపకు చెందిన ఝాన్సీ(32)కి గుండెపోటుతో క్యూకాంప్లెక్స్‌లో కుప్పకూలింది. వెంటనే తోటి భక్తులు, డిస్పెన్సరీ నర్సులు సీపీఆర్ చేశారు. ఈ క్రమంలో ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఝాన్సీ లండన్‌లో స్థిరపడినట్లు తెలిసింది. ఝాన్సీ మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు.
అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతోనే తమ కూతురు మృతి చెందిందని తల్లదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ కోసం గంటకి పైగా వేచివున్నామని.. క్యూ కాంప్లెక్స్‌లో పట్టించుకునే వారు లేరని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెండు మెట్ల మార్గాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.